Mahbubnagar

News July 14, 2024

మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులోని అరుణాచల ఆలయానికి గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 19న MBNR, NGKR డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ శ్రీదేవి శనివారం తెలిపారు. నూతన BS6 బస్సులను10 ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.https://www.tsrtconline.in ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు.

News July 13, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు!!

image

♥గద్వాల:ముగ్గురు విద్యార్థులకు పాముకాటు
♥గండీడ్:ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
♥KTRను కలిసిన గద్వాల్ భారాస నేతలు
♥గద్వాలలో బీటెక్ స్టూడెంట్ SUICIDE’
♥ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహర్రం సందడి
♥6 గ్యారెండీలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
♥ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు
♥డ్రగ్స్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక నిఘా
♥మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు:SIలు
♥నూతన పాఠశాలలో చేరిన టీచర్లకు ఘన సన్మానం

News July 13, 2024

MBNR: కాకతీయుల చరిత్రకు సాక్ష్యం కందూరు క్షేత్రం

image

అడ్డాకుల మండలం కందూరు ప్రకృతి ఒడిలో వెలసిన రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం వద్ద సహజసిద్ధంగా పెరిగిన 27 కదంబవృక్షాలు ఉన్నాయి. ఇవి 27 నక్షత్రాలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షాల కింద స్వామివారికి భక్తితో నైవేద్యం వండి సమర్పిస్తారు. ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

News July 13, 2024

గద్వాల: ముగ్గురి విద్యార్థులకు పాముకాటు

image

గద్వాల అర్బన్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. శనివారం నలుగురు విద్యార్థులు మూత్రవిసర్జనకు బయటికి వెళ్ళారు. అందులో ముగ్గురిపై పాముకాటు వేసింది. ఇది గ్రహించిన మరో బాలుడు పాఠశాల సిబ్బందికి తెలపాడు. వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

News July 13, 2024

MBNR: కాంగ్రెస్‌లోకి MLA.. KTRను కలిసిన BRS నేతలు

image

HYD బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ గద్వాల జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం నియోజకవర్గంలోని రాజకీయ పరిమాణాలపై, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం విషయమై కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు.

News July 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. మహబూబ్ నగర్ జిల్లా కొత్త మోల్గారాలు 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 39.3 మి.మీ, వనపర్తి జిల్లా విలియంకొండ 36.8 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 31.3 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 13, 2024

MBNR: మాది ప్రజల పార్టీ: MLA

image

మాది ప్రజల పార్టీ అని, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కాంగ్రెస్ నేత, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం గుండాలలో అంబ రామలింగేశ్వర స్వామి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. AICC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, నాయకులు బాలాజీ సింగ్, భూపతిరెడ్డి, సందీప్ రెడ్డి, ఆశాదీప్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News July 13, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో మాన్యం భూములు మాయం?

image

ఉమ్మడి MBNR జిల్లాలో రాజరిక వ్యవస్థ కొనసాగిన రోజుల్లో దేవాలయాలను నిర్మించిన రాజులు, నిత్య పూజలకు అర్చకుల జీవనోపాధికి అప్పట్లో భూములు ఇచ్చారు. అవి ఇప్పుడు అన్యాక్రాంతమయ్యాయి. MBNRలో 2242.05 ఎకరాలకు గాను 311.18, NGKLలో 4883.15 ఎకరాలకు 1200.81, గద్వాలలో 2873.14 ఎకరాలకు 134.04, వనపర్తిలో 3988.5 ఎకరాలకు 19.21, NRPTలో 1483.24 ఎకరాలకు 111.38 భూమి అన్యాక్రాంతమైందని తెలుస్తుండగా అధికారులు చర్యలు చేపట్టారు.

News July 13, 2024

BREAKING: గద్వాల జిల్లాలో బీటెక్ స్టూడెంట్ SUICIDE

image

ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధి ఉప్పల్ దొడ్డి నీటి పంపు సమీపంలో ఈరోజు ఉదయం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అయిజ మండలం ఉప్పల్ క్యాంపు గ్రామానికి చెందిన చెన్నకేశవరావు(26) బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

WNP: అసైన్డ్ భూములకు ఇచ్చేది లేదు: మంత్రి పొంగులేటి

image

గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మరోసారి చేయొద్దనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా సమావేశంలో మాట్లాడారు. ఫాంహౌస్లు, గుట్టలు, ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఈసారి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని, పంటలు సాగు చేసుకునే నిజమైన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, అత్యధిక మంది రైతుల అభీష్టం మేరకు ఈ పథకం అమలు చేసేందుకు నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు.