Mahbubnagar

News July 13, 2024

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహర్రం సందడి

image

మొహర్రం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో, పట్టణాలలో పెద్ద పీర్లు, తానే అబ్దుల్లా, ఖాసీం, అలీ అక్బర్ పీర్ల చావిడిలో పీర్లు కొలువు దీరడంతో సందడి నెలకొంది. శుక్రవారం వీటికి చావిడిలో ప్రతిష్టించి, పూజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. చావిడిల ఎదురుగా అలాయ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఊరేగింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News July 13, 2024

గద్వాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

కుటుంబ కలహాల వల్ల మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన పద్మ (36)కు కొన్ని రోజులుగా భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. దీంతో శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

News July 13, 2024

వ్యవసాయంపై ఆధారపడిన వారికే సాయం: మంత్రి జూపల్లి

image

రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువైనా అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రైతు భరోసా సమావేశంలో మాట్లాడుతూ.. అయితే అర్హులైన రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారికి మాత్రమే సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు సేకరిస్తోందని పేర్కొన్నారు.

News July 13, 2024

ఉమ్మడి పాలమూరులో మోస్తారు వర్షం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, జడ్చర్ల, కోస్గి, మక్తల్, గద్వాల్, కొడంగల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అనంతరం సిబ్బంది పునరుద్ధరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

News July 13, 2024

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: డీకే అరుణ

image

కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ మల్లిక గార్డెన్స్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

News July 13, 2024

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల

image

చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు, రాజకీయ నేతల అభిప్రాయాలు తీసుకొని రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తామన్నారు.

News July 12, 2024

కొడంగల్: అత్తారింటికి వెళ్తూ.. అనంతలోకాలకు

image

అత్తారింటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన గొట్లపల్లి రాంరెడ్డి(30) ఈనెల 6న కొడంగల్ మండలం బల్కాపూర్ గ్రామంలోని అత్తారింటికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బుల్కాపూర్ గేట్ వద్ద బైక్ అదుపుతుప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

News July 12, 2024

మహబూబ్‌నగర్ TODAY TOP NEWS

image

✏రైతుల అభిప్రాయాలు స్వీకరించిన కేబినెట్ సబ్ కమిటీ.. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
✏PU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
✏షాద్‌నగర్: ఘోర ప్రమాదం.. లారీ కిందపడి వ్యక్తి మృతి
✏పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి:SFI
✏కొడంగల్: టీచర్లు రాకపోవడంతో పాఠశాలకు తాళం
✏ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు
✏వన మహోత్సవం.. అధికారుల ప్రత్యేక ఫోకస్
✏గ్రూప్-1 మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోండి:R. ఇందిర,స్వప్న

News July 12, 2024

వన మహోత్సవంలో పూర్తి లక్ష్యాలను సాధించాలి: విజయేందిర

image

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండలాల వారీగా వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వనమహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల, ప్రజాపాలన కేంద్రాలు, మహిళా శక్తి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

News July 12, 2024

PU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సాయంత్రం OSD మధుసూదన్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ విడుదల చేశారు. 6వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలో 60.55 శాతం ఉత్తీర్ణులు కాగా, 5వ రెగ్యులర్ సెమిస్టర్‌లో 55.44 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. మొత్తం 29 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు చెప్పారు.