India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ లాజిస్టిక్ ఏజెంట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏటీఎం రవీందర్ తెలిపారు. ఆసక్తిగల వారు నగర పరిధిలో రూ.5 వేలు,మండల,గ్రామపరిధిలో రూ.వెయ్యి చెల్లించి తీసుకోవాలని,మిగతా వివరాల కోసం పృథ్వీరాజ్ (GDWL,వనపర్తి)-9154298609, శ్రీనివాస్ (SDNR,కల్వకుర్తి)-91542 98615,రాజ్ కుమార్ (MBNR,నారాయణపేట) -91542 98613, శరత్ యాదవ్ (కొల్లాపూర్,NGKL,అచ్చంపేట)-91542 98611 సంప్రదించాలన్నారు.
జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 14న ఉమ్మడి జిల్లాస్థాయి ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్ కమ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బాబులాల్ గురువారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22, 23 తేదీల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు.
వనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు. గురువారం ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ప్రధాన మంత్రి మోదీ యువకుడిని ప్రశంసిస్తూ లేఖను పంపించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NRPTలో నిర్వహించిన బహిరంగ సభలో అంత్వార్‌కు చెందిన శివ తాను గీసిన శివాజీ మహారాజ్, ప్రధాని మోదీ ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించాడు. చిత్రపటాన్ని PM తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా స్వీకరించారు. దీంతో అభినందిస్తూ ఢిల్లీ నుంచి ప్రశంస పత్రాన్ని పంపించారు. యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు.
CM రేవంత్ రెడ్డిని గద్వాల కాంగ్రెస్ ఇంచార్జి సరిత తిరుపతయ్య గురువారం సచివాలయంలో MP మల్లురవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ సీఎంకు సరిత వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ లో ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రాజెక్టులకై ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. గట్టు కృష్ణమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు.
✏NRPT:ఆవు మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు ✏మహబూబ్‌నగర్: రేపు ఉద్యోగ మేళా! ✏రేపు వనపర్తికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక ✏ఏకరూప దుస్తుల వివరాలు అందజేయండి: DEOలు ✏రేపు కలెక్టరేట్ ముట్టడి:ABVP ✏NRPT: చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి మృతి ✏ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు ✏ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మొహర్రం సందడి ✏ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్స్
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని లేకుంటే మాజీ సీఎం KCR గతి పడుతుందని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. గురువారం జడ్చర్ల మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అదే పోకడలు పోతే తాము దేనికైనా తెగిస్తామని హెచ్చరించారు. ఓటు వేయలేరని కింది స్థాయి కార్యకర్తలను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలో న్యాయవాదిపై దాడికి పాల్పడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునేంతవరకు తాము రోజు నిరసన తెలియజేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వము హైదరాబాదులో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఏందిరా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆసక్తి గలవారు ఈనెల 19లోపు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
బొంరాస్ పేట మండలం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర బాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాదులోని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. అధైర్య పడకండి, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.