India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటా జనాభా పెరుగుతూనే ఉంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. 35,26,605 ఉన్న జనాభా 2024 సంవత్సరం వచ్చేసరికి.. 41,62,093కు చేరింది.. ఈ 12 సంవత్సరాలలో.. 6,35,488 జనాభా పెరిగింది. నెలకు సగటున 50 వేల జనాభా పెరుగుతూనే ఉంది. కుటుంబ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఆపరేషన్లకు ముందుకొచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 22.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 1.3 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 1.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో స్పౌజ్ విభాగంలో ప్రత్యేక పాయింట్లు పొందిన వారి వివరాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఈవోలు స్పౌజ్ బదిలీలను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలు ఉంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.
మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జానీపాషా తెలిపారు. SSC పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటాతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.
రైతుభరోసా పథకంపై ఈ నెల 12న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వనపర్తిలో నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ కమిటీ సభ్యులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఆరు నెలల కింద అమ్మ సూసైడ్ చేసుకోగా నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో నాన్న మృతిచెందాడు. దీంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. సర్జఖాన్ పేటకు చెందిన కుమ్మరి శ్రీనివాస్(36) చంద్రకల్ క్రిస్టియన్ హాస్టల్‌లో చదువుకుంటున్న కూతురుని చూసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి కిందపడ్డాడు. చికిత్స పొందుతూ బుధవారం గాంధీ ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఏఎస్ఐ బాలకిషన్ తెలిపారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ధ మండల కేంద్రానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు బుధవారం CM రేవంత్ రెడ్డి నగదు పురస్కారం అందజేశారు. సచివాలయంలో రూ.25 లక్షల చెక్కును అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, అధికారులు పాల్గొన్నారు. పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు.
పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డిసెంబర్ లోపు సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.