India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరచింతలోని జగన్ వాడలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఉప్పరి కర్రెన్న (55) నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేస్త్రీ వద్ద దినసరి కూలీగా పనిచేసే వాడని, బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జూనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది బదిలీ కానున్నారు. బదిలీలకు సంబంధించిన మార్గ దర్శకాలు ఒకటి, రెండు రోజుల్లో కమిషనర్ కార్యాలయం నుండి విడుదల కానున్నాయని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇంటర్ విద్యలో బదిలీలకు “జీరో సర్వీసు”ను పరిగణలోకి తీసుకోబోమని అధికారులు పేర్కొన్నారు.
కల్వకుర్తి పట్టణానికి చెందిన రైతు వసంత యాదయ్య(48) మంగళవారం పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటేసింది. స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. యాదయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MBNR, NGKL డీఈవోలు రవీందర్, గోవిందరాజులు తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు అర్హులని, https://awards.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లాలోని పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా HMలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, న్యూఢిల్లీలో ఈ పురస్కారాలను అందిస్తారని అన్నారు.
ప్రేమ పేరుతో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.సురేశ్ తెలిపారు. వనపర్తి జిల్లా పెద్ద మందడికి చెందిన సంతోష్ గత మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహంపై ఆ యువతి ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దలతో మాట్లాడినా మార్పు రాకపోవడంతో మోసం చేసిన సంతోష్‌తో పాటు అతని తల్లి జానకిపై మంగళవారం కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.
ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీరు తీసుకుంటేనే PRSI పథకం పూర్తవుతుంది. NRPTలో టెక్స్‌టైల్ పార్కు, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కు, ఉమ్మడి MBNR జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.
MBNR జిల్లా నుంచి 70 ఏళ్ల తర్వాత మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఈ జిల్లాను అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉంది అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా జిల్లా నుంచే సమీక్షా సమావేశాలు ప్రారంభించడం జరిగిందన్నారు. గత పాలకులు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు అమ్మొద్దంటూ ప్రధాన రోడ్లపై ఉన్న షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, కూల్ డ్రిక్స్ బాటిళ్లను నిషేధించారు. తాజాగా MHకు చెందిన దినేశ్ మంగళ్ వద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ గమనించిన ఫారెస్ట్ ఆఫీసర్లు అతడికి రూ.2వేల ఫైన్ వేశారు.
దొంగలు దొంగలు ఒకటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని MP డీకే అరుణ BRS, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరీక్ష విమర్శలు చేశారు. గద్వాల విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను ఓడించాలని శపథాలు చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసినా ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే తనను గెలిపించాలని డీకే అరుణ అన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో బడికి వెళ్లని పిల్లలను బడికి తీసుకొచ్చే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖపై నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.