Mahbubnagar

News May 9, 2024

NGKL: అక్రమ సంబంధం.. భార్యను చంపిన భర్త

image

భర్త చేతిలో భార్య మృతి చెందిన HYD వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. NGKL జిల్లా ఉయ్యాలవాడ చెందిన సతీష్, స్వాతి దంపతులు. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈనెల 6న భార్య సతీష్‌తో గొడవ పడగా.. స్వాతి గొంతునులిమి చంపి ఫ్యానుకు ఉరేసి, పారిపోయాడు. స్వాతి పేరెంట్స్ ఆస్తి పిల్లల పేరా చేయాలని డిమాండ్ చేశారు. స్వాతి డెడ్ బాడీ ఖననం చేయకుండా ఉంచారు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

News May 9, 2024

నాగర్‌కర్నూల్‌లో నువ్వా.. నేనా..!

image

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో నువ్వా.. నేనా..? అనే రీతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, BJP అభ్యర్థి భరత్ ప్రసాద్, BRS అభ్యర్థి RSP ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు రోజులు కీలకం కానున్నాయి.

News May 9, 2024

NRPT: జిల్లాలో ఒకేరోజు CM, PM ఎన్నికల ప్రచారం

image

జిల్లా పరిధిలో ఒకేరోజు గంట వ్యవధిలో CM, PM ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో BJP MP అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా మక్తల్‌లో కాంగ్రెస్ MP అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డికి మద్దతుగా CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌కు హాజరుకానున్నారు. దీంతో జన సమీకరణకు నాయకులు ఇబ్బందులు పడుతున్నారు.

News May 9, 2024

NGKL: తేనెటీగల దాడిలో యువకుడు మృతి

image

తేనెటీగల దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారక్(22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో నేలను దున్నుతున్న క్రమంలో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒకసారిగా తారక్ పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుకుంటూ పొలంలో వెళుతుండగా బోర్లపడి మృతి చెందాడు. తారక్ అవివాహితుడు గ్రామంలో విషాదం నెలకొంది.

News May 9, 2024

MBNR: ఆ మరుసటి రోజు నుంచి నేతల్లో టెన్షన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో ఎన్నికల బరిలో ఉన్న 50 మంది అభ్యర్థులు తమ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత, ఓటర్ల పని పూర్తవుతుంది. అభ్యర్ధులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి టెన్షన్ ప్రారంభం కానుంది. ఫలితం కోసం 22 రోజుల నిరీక్షణ తప్పదు. దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

News May 9, 2024

ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. MBNR, NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

తాగునీటి అవసరాలకు కర్ణాటక నుంచి నీరు

image

MBNR: తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రాయచూర్ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసి ఆ తరువాత నీటిని విడతల వారీగా విడుదల చేయనున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శి జూరాల ప్రాజెక్టుకు ఈ నీరు చేరుకుంటుంది.

News May 9, 2024

ఎంపీ ఎన్నికలు.. ప్రచారం జోరు

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి దగ్గర పడింది. ఈనెల 11న సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగించాల్సి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలలో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. MBNR, NGKL స్థానాలలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ కొనసాగుతుంది. బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

News May 9, 2024

MBNR: ప్రతి సెక్షన్లో 88 మందిని మాత్రమే చేర్చుకోవాలి !

image

MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం కళాశాలలో మంజూరైన ప్రతి సెక్షన్లో 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అదనపు సెక్షన్లు అవసరం అవుతే తప్పనిసరిగా ఇంటర్ బోర్డ్ అనుమతి తీసుకోవాలని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాతో పాటు గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని అన్నారు.

News May 9, 2024

నాగర్‌కర్నూల్: 4 నెలలు.. 136 ప్రమాదాలు

image

NGKL జిల్లాలో 4 నెలల్లో 136 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదాల్లో 68 మంది మరణించగా.. 168 మంది తీవ్రంగా గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా బిజినేపల్లి మండలంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రహదారులపై వాహనాల నడుపుతున్న సమయంలో వేగాన్ని నియంత్రించలేకే ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.