Mahbubnagar

News July 9, 2024

మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం: రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాలను అన్ని విధాల బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3620 మహిళా సంఘాలకు రూ.334.2 కోట్ల నిధులను విడుదల చేశారు.

News July 9, 2024

ప్రియదర్శిని జూరాల UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఇన్ ఫ్లో మరింత పెరిగి సోమవారం ప్రాజెక్టుకు 2,051 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 132 క్యూసెక్కులతో కలిపి మొత్తం 132 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 7.701 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News July 9, 2024

MBNR: పదవీ కాలం ముగిసినా.. అందని వేతనాలు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి గౌరవ వేతనం అందలేదు. ZPTC, MPP, MPTC 8నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. 2023 అక్టోబరు వరకు వేతనాలు అందాయి. ఆ తర్వాత వీరికి వేతనం అందలేదు. ఈనెల 3న MPPలు, MPTCల పదవీ కాలం ముగియగా, 4న జడ్పీ ఛైర్‌పర్సన్, ZPTCల పదవీ కాలం ముగిసింది. ZP ఛైర్‌పర్సన్‌కు నెలకు రూ. లక్ష, ZPTCలకు రూ.13 వేలు, MPTCలకు రూ.6,500 వేతనం ఉంది.

News July 9, 2024

పాలమూరు ప్రాజెక్టులకు మహర్దశ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్దశ మొదలైంది. కోయిల్ సాగర్, కల్వకుర్తి, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల, గట్టు, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా కొత్త ఆయకట్టు పెంచేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

News July 9, 2024

NGKL: హర్షసాయి పేరుతో ఘరానా మోసం

image

హర్షసాయి పేరు చెప్పి మోసానికి పాల్పడిన ఘటనపై ఉప్పనుంతలలో కేసు నమోదైంది. SIలెనిన్ వివరాలు.. NLG జిల్లాకు చెందిన హనుమంత్ NGKL జిల్లా దేవదారికుంటతండాలో ఇటుకబట్టి ప్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరు చెప్పి ఫోన్‌ చేసి ఆర్థికసాయం చేస్తానని నమ్మించాడు. అందుకు కొంత డబ్బు ఫోన్‌పే చేయాలనగా నమ్మిన బాధితుడు రూ.54,500 పంపించాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.

News July 9, 2024

జిల్లాకు సీఎం.. 937 మంది పోలీసులతో బందోబస్తు

image

CM రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. SP డి.జానకి నేతృత్వంలో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 937 మందితో పకడ్బందీగా భద్రతను చేపడుతున్నారు. SP, ఇద్దరు అదనపు SPలు, 8 మంది DSPలు, 35 మంది CIలు, 64 మంది SIలు, 98 మంది ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొననున్నారు.

News July 9, 2024

MBNR: సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి నజర్!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఇక్కడి అభివృద్ధిపై ఆయన నజర్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో ఈరోజు చర్చిస్తారు.

News July 9, 2024

MBNR: సీఎం జిల్లా పర్యటన.. భారీ బందోబస్తు

image

జిల్లా కేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌తో పాటు ఏఎస్ఎన్ గార్డెన్ సోమవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ఏఎస్ఎన్ గార్డెన్లో సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.

News July 9, 2024

CM రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా..!

image

☞ఉదయం 12 గం.: బేగంపేట్ విమానాశ్రమం నుంచి బయలుదేరుతారు
☞12:45: మహబూబ్ నగర్ చేరుకుంటారు
☞12:45-1:00: ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖాముఖి
☞1:00 గం.: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన
☞1:45-4:45: ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం
☞5:00-5:45: భూత్పూర్ ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నాయకులతో సమావేశం
☞సాయంత్రం 6 గం.: HYDకు తిరుగు ప్రయాణం

News July 9, 2024

వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌” మంజూరు

image

నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌”ను మంజూరు చేసిందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 65 ఐటీఐ సెంటర్లను స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.