Mahbubnagar

News July 8, 2024

ఉమ్మడి పాలమూరుకు YELLOW ALERT

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News July 8, 2024

పాలమూరు “TODAY TOP NEWS”

image

✒రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో మొదలైన మొహర్రం సందడి
✒రేపు NRPTకు సినీనటి మంచు లక్ష్మి రాక
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
✒రేపు వర్షాలు ఎల్లో అలర్ట్ జారి
✒మద్దూర్:స్వామిజీ జీవసమాధి.. బయటకు తీసిన పోలీసులు
✒కొడంగల్: ఢిల్లీకి బయలుదేరిన ఒగ్గుడోలు కళాకారులు
✒ప్రజావాణి:సమస్యలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✒టీచర్లకు ఆంగ్లంపై నైపుణ్యం.. కొనసాగుతున్న శిక్షణ

News July 8, 2024

ముంబాయిలో నారాయణపేట వాసి మృతి

image

నారాయణపేటకు చెందిన యువకుడు ముంబైలో మృతిచెందాడు. నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 19వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని మొనప్ప కాలనీకి చెందిన మల్లేశ్(27) పది సంవత్సరాల క్రితం నిర్మాణ రంగంలో పనుల కోసం ముంబైకి వలస వెళ్లాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

MBNR జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్​ రెడ్డి మంగళవారం పాలమూరుకు జిల్లాకు వస్తున్నారని, కలెక్టరేట్(IDOC)కు మధ్యాహ్నం 12.45గంటలకు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు.

News July 8, 2024

గద్వాల: తల్లిని చంపిన కేసులో కొడుకుకి 10ఏళ్ల జైలు

image

తల్లిని చంపిన కేసులో కుమారుడికి 10ఏళ్లు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ గద్వాల కోర్టు ప్రిన్సిపల్ ఇన్‌ఛార్జ్ జడ్జి కుషా తీర్పునిచ్చారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ పై 2023లో శాంతినగర్ పీఎస్‌లో కేసు నమోదు అయిందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నేరస్థులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News July 8, 2024

MBNR: జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్ల ఏర్పాటు !

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ఆలయాలు, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలు, జన సంచారం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రూ.85 లక్షల వ్యయంతో 5 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు సైతం గుర్తించారు.

News July 8, 2024

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటమే: TWJF

image

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని TWJF రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య హెచ్చరించారు. MBNR ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో సోమయ్య పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 6నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడంలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఇల్లు, హెల్త్ కార్డు ద్వారా ఉచిత వైద్యం, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

News July 8, 2024

NRPT: డిజిటల్ క్లాస్ రూమ్‌ ప్రారంభించనున్న మంచు లక్ష్మి

image

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి రేపు ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి రానున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్, వెణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రత్నం రెడ్డి కలిసి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు.

News July 8, 2024

వనపర్తి: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. తప్పిన ముప్పు

image

వనపర్తి జిల్లా రేవల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఈ ఆస్పత్రిని 1999 సంవత్సరంలో నిర్మించారు. నాసిరకంగా కట్టడంతోనే పైకప్పు కోల్పోయిందని రోగులు అన్నారు. ఉన్నతాధికారుల స్పందించి ఆసుపత్రిని బాగు చేసి, రోగులకు సేవలు చేయాలని మండల కేంద్ర ప్రజలు కోరారు.

News July 8, 2024

ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలు వాట్సాప్ ద్వారా పంపాలి

image

NGKL: స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణ ప్రచార గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.