Mahbubnagar

News May 8, 2024

UPDATE.. లారీని తప్పించబోయి బస్సు బోల్తా !

image

హైవే-165పై అడ్డాకుల సమీపంలో స్నేహ కంపెనీ వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న <<13204316>>బస్సు బోల్తా<<>> పడింది. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా.. వారిలో మియాపూర్‌కు చెందిన వంశీ, బెంగళూరుకు చెందిన ప్రజ్ఞా పరిమిత పరిస్థితి విషమంగా ఉంది. అడ్డాకుల పోలీసులు వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారు. లారీని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.

News May 8, 2024

MBNR-13,221, NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు

image

ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.

News May 8, 2024

ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల వలస ఓటర్లు !

image

పాలమూరు అంటేనే వలసలకు చిరునామాగా పేరొందిన జిల్లా. ఈ జిల్లా నుంచి సుదూర ప్రాంతాలైన ముంబై, పుణె, సోలాపూర్, భీమండి ప్రాంతాలతోపాటు హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో సుమారు 3.5 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.

News May 8, 2024

MBNR-13,221, NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు

image

ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.

News May 8, 2024

MBNR: ‘రైతు భరోసా’ విడుదల.. ఈసీ బ్రేక్

image

ఈసీ ఆదేశాలతో పాలమూరులో రైతు భరోసాకు బ్రేక్ పడింది. ఉమ్మడి జిల్లాలో 11.25 లక్షల మంది రైతులు ఉండగా వారందరికీ ఏటా రూ.1,256 కోట్ల పెట్టుబడి సాయం అందేది. అయితే మంగళవారం వరకు MBNR-2.6 లక్షల మంది రైతులకు రూ.164 కోట్లు, NGKL- 3.6 లక్షల మందికి రూ.370 కోట్లు, GDWL-1.63 లక్షల మందికి రూ. 227 కోట్లు, WNPT-175 లక్షల మందికి రూ.181 కోట్లు, NRPT-1.77 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.225.17 కోట్ల చెల్లింపులు జరిగాయి.

News May 8, 2024

MBNR: ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు అడ్డాకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2024

MBNR: భవనం పైనుంచి పడి విద్యార్థి మృతి

image

భవనంపై నుంచి కిందపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. మహమ్మదాబాద్ మండలం నంచర్లకు చెందిన శివకుమార్(16) MBNR పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. పరీక్షల అనంతరం హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.

News May 8, 2024

TET దరఖాస్తులు.. MBNR, NGKLలో అత్యధికం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2024కు మొత్తం 43,557 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 17,608 మంది, పేపర్-2కు 25,959 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు అత్యధికంగా NGKL జిల్లా నుంచి 4,453 మంది, పేపర్-2కు అత్యధికంగా 7,688 మంది MBNR నుంచి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

News May 8, 2024

వనపర్తి: మే 8న సాయంత్రం 5 లోగా ఓటు వేయాలి: అదనపు కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికలకు ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు మే 8న సాయంత్రం 5 గంటల లోపు IDOC లోని ఫేసిలీటేశన్ సెంటర్ లో ఓటు వేయాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి యం నగేష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలట్ కొరకు ఇదివరకే ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు రేపు సాయంత్రంలోగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

News May 8, 2024

గద్వాల:పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి

image

గద్వాల: ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందికి స్థానిక MLD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పాటిస్తూ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు.