India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే MLAలుగా గెలుపొందారు. గద్వాల, అలంపూర్ BRSకు చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు విజయం సాధించారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ బలం 13కు పెరగగా.. BRSకు బలం ఒకటికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి APలో గద్వాల కాంగ్రెస్‌కు కంచుకోట.
పాలమూరు యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ కశాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 15 వరకు చెల్లించాలని పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ శనివారం తెలిపారు. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మల్లేశ్(12) శనివారం తాతతో కలిసి గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లాడు. అక్కడ అన్నం తిని నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్లగా బాలుడు అందులో పడ్డాడు. అది గమనించని తాత.. చాలా సేపైనా బాలుడు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లగా బావిలో పడినట్లు గుర్తించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు చేశారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే మైనార్టీ విద్యార్థులకు, సీఎం విదేశీ విద్యా పథకం కింద లబ్ధి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి గోపాల్ తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు పొందిన వారు, పీజీలో 60 శాతం మార్కులు వచ్చి పిహెచ్ డి చేయాలనుకున్న వారు ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. ఈనెల 8 నుంచి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, సాగర్ డివిజన్లున్నాయి. ఇటీవల సాగర్‌లో పెద్దపులి, అరుదైన జాతి రాబందు కనిపించగా సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో దుప్పులు, జింకల ఆవాసాలకే పరిమితమైన అడవిలో తాజాగా శాకాహార, మాంసహార జంతువుల సంఖ్య పెరిగింది. దక్షిణాదిలోనే అరుదైన ఎలుగుబంట్లు గుర్తించారు.
క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 11,12న HYDలోని హకీం పేటలోని స్పోర్ట్స్ స్కూల్లో హాజరుకావాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 26 మంది ఎంపికయ్యారని, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, కమ్యూనిటీ సర్టిఫికెట్, 10 పాస్ ఫొటోలు, రెండు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ZP ఛైర్‌పర్సన్ సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ నేతలు సైతం ఇటీవల గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.
పోలీస్ సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గద్వాల ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నేర, న్యాయచట్టాలు 2023 ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నూతన చట్టాల ద్వారా అవకాశం కలిగిందన్నారు. ఇకపై నూతన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు
✒BRSకు షాక్.. కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✒పార్టీ మారిన MLAలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✒GDWL,NRPTలో రేపు భారీ వర్షాలు
✒పలుచోట్ల జగ్జీవన్‌రామ్ వర్ధంతి వేడుకలు
✒వనపర్తి: GO10 రద్దుచేయాలని అంగన్వాడీల రిలే నిరాహారదీక్షలు
✒సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి:SPలు
✒వన మహోత్సవంపై అధికారుల ప్రత్యేక ఫోకస్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు కాస్త ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. మీ మండలంలో వర్షం పడిందా.. కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.