India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తున్నాయని శనివారం హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిత్వాలను చంపేసుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేశవరావును రాష్ట్ర ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల బిఆర్ఎస్ నుండి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. నేడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీ జెండా నీడలో కొనసాగుతున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నడిగడ్డలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లారు. గత 2 నెలలుగా నడిగడ్డలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది.
ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్, ప్రియాంక దంపతులు జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి సాయికృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. భర్త పరిశ్రమలో విధులకు వెళ్ళగా ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను వివాహం చేసుకోవడంతో Way2Newలో వచ్చిన “బడికి వెళ్లే బాలికకు వివాహం.. కేసు నమోదు” అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. MEO వెంకటయ్య, AMO శ్రీనివాస్ బాలికను మహమ్మదాబాద్ కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచారం ఇచ్చిన టీచర్లను అభినందిస్తూ.. పూర్తి నివేదికను జిల్లా విద్యాధికారికి అందిస్తామన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. MBNR, NGKL, WNPT, జడ్చర్ల, కోస్గి, మక్తల్, గద్వాల్, కొడంగల్ ప్రాంతాల్లో మురుగు నీరు రహదారులపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం ముగిసిన తర్వాత సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. వర్షం పోవడంతో పంటలకు కొంత ఆసరాగా నిలిచింది.
ఓ నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష రూ.5లక్షల జరిమానా రాజేంద్రనగర్ కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. NGKL జిల్లాకు చెందిన ఓ కుటుంబం శంషాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, అక్కడే ఉంటున్న శివకుమార్ వారికి పరిచయమై ఓ బాలికను 2017 మే 18 నాందేడ్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పట్లో కేసు నమోదు అయింది. కోర్టు శిక్ష విధించింది.
నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయం రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గాలో మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం 75వ వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నాటారు.
Sorry, no posts matched your criteria.