India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
షీ టీమ్స్‌తో మహిళలకు, విద్యార్థినిలకు భరోసా కల్పిస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే షీ టీమ్ సభ్యులకు నేరుగా లేదా 8712670398 నంబర్ ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చట్టరీత్య నేరమని హెచ్చరించారు.
డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని MBNR జిల్లాకలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. డ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలలో పర్యటించి ఆమె పరిశీలించారు. చెత్త, చెదారం రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని కాలనీవాసులకు సూచించారు. మురుగునీరు ప్రవహించేలా డ్రైనేజీలను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పలువురు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమల్లలో పర్యటించి ఇక్కడ నెలకొన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
MBNR:ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8న జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాను ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్,2 పాస్ ఫొటో సైజ్ ఫొటోలతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాల సెట్ తో హాజరు కావాలన్నారు.
పాలమూరు యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చాయి. ప్రధాన మంత్రి శిక్ష ఉచ్ఛతర్ అభియాన్(పీఎంయూఎసెచ్ఎ) పథకం కింద రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.78 కోట్లు కొత్త హాస్టళ్లు, బిల్డింగుల కోసం ఖర్చు చేయనున్నారు. భవనాలు, ఇతర మైనర్ రిపేర్ల కోసం రూ.3.60 కోట్లు, ల్యాబ్ లలో అత్యాధునిక పరికరాల కోసం రూ.14.26 కోట్లు, రీసెర్చ్, బోధన, శిక్షణ తదితర వాటి కోసం 3.22 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.
వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికపై సొంత చిన్నాన్నే(20) అత్యాచారానికి పాల్పడ్డాడు. SI మంజునాథ్ రెడ్డి వివరాలు.. కొత్తకోటకు చెందిన దంపతులు ముగ్గురి పిల్లలను బంధువుల వద్ద పెట్టి వలస వెళ్లారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లల వద్దకు వచ్చిన చిన్నాన్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా కేకలు వేసింది. ఇద్దరు చెల్లెళ్లు ఏడ్చుకుంటూ వచ్చి స్థానికులకు చెప్పారు. నిందితుడు పారిపోగా కేసు నమోదైంది.
పిల్లలు కావడంలేదని ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. చారకొండ మండలం శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)కి APలోని కంభంపాడుకు చెందిన శేషుతో 2014లో పెళ్లైంది. పిల్లలు కాకపోవడంతో దంపతులు తరచూ గొడవ పడేవారు. ఆమె 3నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. బుధవారం భర్తకు ఫోన్ చేసి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయంది. ఘటనపై నిన్న కేసు నమోదైంది.
ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ డీజిల్, టర్నర్, మిషనిస్టు, కోపా తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన అక్కమాంబ గుహలు, కదిలి వనం, అక్టోపాస్ వ్యూ పాయింట్, టూరిజం స్పాట్లను సందర్శించానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sorry, no posts matched your criteria.