Mahbubnagar

News July 4, 2024

విద్యా సంస్థలు బంద్ విజయవంతం: SFI

image

నీట్ పరీక్షల ఫలితాలలో అవకతవకల నేపథ్యంలో నేడు దేశం మొత్తం విద్యాసంస్థలకు బంధు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో SFI, PDSU, NSUI, AISF, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం చేశామని ప్రశాంత్ తెలిపాడు. NTA సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!1/2

image

✒MBNR-జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్ ✒అడ్డాకుల-జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ✒బాలానగర్-జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బాబురావు ✒భూత్పూర్-జిల్లా హర్టీకల్చర్, సెరీకల్చర్ అధికారి కె.వేణుగోపాల్ ✒సీసీ కుంట-జిల్లా యువజన,క్రీడల అధికారి ఎస్. శ్రీనివాస్ ✒దేవరకద్ర-స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి ✒హన్వాడ-DRDO పి.నర్సింహులు ✒జడ్చర్ల-RDO నవీన్ ✒గండీడ్-SC సంక్షేమ శాఖ డీడీ వి.పాండు

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!2/2

image

✒రాజాపూర్-జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్.ఇందిర ✒నవాబు పేట-జిల్లా సహకార అధికారి ఎ. పద్మ ✒మూసాపేట-జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి ✒మిడ్జిల్-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. వెంకటేశ్ ✒కోయిలకొండ-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి.మధుసూదన్ గౌడ్ NOTE:నేటి నుంచి నుంచి ఆయా మండలాలకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.

News July 4, 2024

నారాయణపేటలో రోడ్డు ప్రమాదం

image

నారాయణపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గొడుగేరి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఇద్దరు యువకులు స్కూటీపై ప్రధాన రహదారి పైకి వస్తుండగా అదుపుతప్పి వేగంగా వెళుతున్న టిప్పర్ కిందపడి నరసింహారెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి చేతికి బలమైన గాయం తగిలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

News July 4, 2024

NGKL: విద్యుదాఘాతంతో బాలుడు మృతి

image

విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన విషాద ఘటన రాజాపూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రేకులపల్లి గ్రామ పరిధిలోని ఒప్పితండాకు చెందిన శివ(15) గ్రామపంచాయితీలో విద్యుత్ బల్బును అమర్చుతున్నాడు. పక్కనే ఉన్న 11కేజీ వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి బాలుడిపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

News July 4, 2024

MBNR: 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్

image

కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

MBNR: 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్

image

కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురవారం ఒకే ఒక్క జిల్లాలో మాత్రమే వర్షపాత వివరాలు నమోదు అయ్యాయి. వాటి వివరాలు ఇలా.. అత్యధిక వర్షపాతం నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్, జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 4, 2024

ALERT: EAMCET(ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

image

TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT

News July 4, 2024

కొడంగల్: అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

image

ముగ్గురు కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (62), మొగులమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు సంతానం. కూతుళ్ల పెళ్లిళ్లు చేసి నర్సింహులు అప్పులపాలవడంతో తరచూ భార్యకు చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈక్రమంలో పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.