India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) మూడో విడత దరఖాస్తుకు జులై 4 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మూడో విడత సీట్ అలాట్మెంట్ JULY 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT
జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని పోలీసులకు కొత్త చట్టాల అమలుపై శిక్షణా తరగతులు నిర్వహించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇక నుంచి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలు తమ అనుమానాల నివృత్తి కోసం పోలీస్ శాఖను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
కోస్గిలో ఏర్పాటైన ఉమ్మడి జిల్లాలోని తొలి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా.శ్రీనివాసులు పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, సీఎస్సీ (డేటా, సీఎస్సీ(ఏఐ, ఎంఎల్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతో విద్యను అభ్యసించవచ్చని, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. MBNR-42, NGKL-51, WNPT-49, NRPT-57, GDWL-64 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. త్వరలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.
అమరచింతలో GOVT టీచర్‌పై రౌడీషీటర్ దాడి చేశాడు. MEO భాస్కర్ సింగ్ వివరాలు.. స్థానిక స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ కొట్టారు. ఈ విషయమై విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా నచ్చజెప్పి పంపారు. బుధవారం విద్యార్థి తండ్రితోపాటు వచ్చిన రౌడీషీటర్ సదరు టీచర్‌పై దాడీచేసి బ్లేడ్‌తో బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని కానీ కేసు వద్దన్నారని SI సురేశ్ చెప్పారు.
HCA అండర్-23 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు ఈనెల 7న ఉదయం 10 గంటలకు పిల్లలమర్రి దారిలోని ఎండీసీఏ మైదానంలో ఎంపికలు చేపడుతున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. తెల్లని దుస్తులు, ఆధార్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, పదో తరగతి/ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని కోరారు.
పాలమూరు విశ్వవిద్యాలయ పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉపకులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ సహా కొత్త కోర్సులు ప్రారంభిస్తారని యువత భావించినా.. ఆశలు అడియాశలే అయ్యాయి. బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నా .. కొత్తగా వారిని తీసుకునే పరిస్థితి లేదు. ఉప కులపతి నియామకంపై స్పష్టత కొరవడింది. తొందరగా వీసీని అపాయింట్ చేయాలని విద్యార్థులు కోరారు.
పదో రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ గురువారం నుంచి ఈ నెల 6 వరకు నిర్వహిస్తున్నారు. పూర్వ పది జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులతో పాటు బుధవారం క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీల్లో ఎంపికైన 16 మంది పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు, రాష్ట్ర క్రీడల సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రవీందర్ కోరారు. http:///nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ లో వివరాలను నిర్ణీత నమూనాలో నిక్షిప్తం చేయాలని సూచించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వట్టువర్లపల్లిలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 3.3 మిల్లీమీటర్ల, మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటలో 3.0 మిల్లీమీటర్ల, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 3.0 మిల్లీ మీటర్లు, గద్వాల జిల్లా కోదండపూరులో 1.8 మిల్లీమీటర్లు నమోదయ్యింది.
Sorry, no posts matched your criteria.