India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంరాస్ పేట్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మెట్లకుంటకు చెందిన భైరం నర్సింలు అనే రైతు అప్పుల బాధ భరించలేక గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రావుఫ్ తెలిపారు.
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ పాటించాలి:SFI,AISF ✒WNPT:’ACBకి చిక్కిన గోపాల్ పేట్ MRO’ ✒మహమ్మదాబాద్ లో నూతన కలెక్టర్ విజిట్ ✒NGKL:జాగ్రత్త..వ్యవసాయ పొలంలో చిరుత సంచారం ✒CM రేవంత్ రెడ్డికి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి లేఖ ✒యువత టెక్నికల్ రంగాలపై దృష్టి సారించాలి: మంత్రి జూపల్లి ✒కొత్త పాఠశాలలో చేరిన పలు ఎన్జీటీ టీచర్లు ✒ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలలో MPP,MPTC,ZPTCలకు ఘన సన్మానం
లంచం తీసుకుంటూ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండల పరిధిలోని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఒకరి నుంచి MRO, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎస్.శ్రీనివాసులు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ACBని ఆశ్రయించారు. బుధవారం రూ. 8 వేల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి తండా శివారులో వ్యవసాయ పొలంలో చిరుత పులి సంచరించింది. పరిసర రైతులు పొలంలో పాదముద్రలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. వారు ఎంగంపల్లితండాలో చిరుత పులి సంచరించిన వ్యవసాయ పొలాల్లో అధికారులు పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12ప్రాంతాలు గుర్తించారు. నల్లమల పరిధిలో మన్ననూరు, సోమశిలలో వసతి, శ్రీశైలం ఆలయ సందర్శన, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్ ఉండనుంది. దీంతో స్థానికంగా ఉపాది, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనే చర్చ సాగుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ MLA వాకిటి శ్రీహరికి పదవి వస్తుందని టాక్. రాష్ట్రంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే, గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో బెర్త్ ఖాయమని వాకిటి వర్గీయులు అంటున్నారు. పదవి వస్తే జిల్లాలో తొలిసారి MLAగా గెలిచి మంత్రి అయిన ఘనత ఆయనదే.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 719 మంది MPTCలు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,448 మంది ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సుమారు 2,413 మంది కొత్త స్థానాల్లో విధుల్లో చేరగా.. మరో 1,095 మంది ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాత స్థానాల్లోనే కొనసాగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, మారుమూల తండాలు, శివారు గ్రామాల్లో కొత్త ఉపాధ్యాయులు రాకపోవడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది.
ఇటీవల పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పరీక్షలలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి బుక్ అయిన విద్యార్థులు వ్యక్తిగతంగా మాల్ ప్రాక్టీస్ కమిటీ ఎదుట బుధవారం ఉదయం 11:30 గంటలకు హాజరుకావాలని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.palamuruuniversity.com సైట్‌ను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 81 ఉన్నాయి. వీటిలో 40,746 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలు 163 ఉన్నాయి. వీటిలో 29,297 మంది చదువుతున్నారు. మొత్తం 70వేల మందికి ఇద్దరే ఫిజికల్ డైరెక్టర్లు (వ్యాయామ అధ్యాపకులు) ఉన్నారు. ఒకరు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో, మరొకరు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారు. PDలు లేకపోవడంతో క్రీడ రంగంలో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.
Sorry, no posts matched your criteria.