India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS) కింద తొలిరోజు 9 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో MBNRలో 1, GDWL 1, WNPT 1, NGKL 2,NRPT 4 కేసులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజు 30 నుంచి 40 కేసులు నమోదయ్యేవి. అలాంటి జులై 1న 9 కేసులే నమోదయ్యాయి. అటు నిత్యం చాలా కేసులు నమోదయ్యే MBNR గ్రామీణా PSలో ఒక్కటి నమోదు కాలేదు. కొత్త చట్టాల్లోని సెక్షన్లు క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్‌ఐఆర్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని WNP జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ప్రసవాలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి పేదలు డబ్బులు వృధా చేసుకుంటున్నారని, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు మెరుగుపరచుకోవాలని సూచించారు.
నూతన చట్టాల ప్రకారం గద్వాల జిల్లా రాజోలి పోలీస్ స్టేషన్‌లో మొదటి కేసు నమోదైంది. రాజోలికి చెందిన బటికేరి శ్రీనివాసులు జీవితంపై విరక్తి చెంది సుంకేసుల డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని కొడుకు బసవరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై జగదీశ్ సెక్షన్ 195 BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం) ప్రకారం కేసు నమోదు చేశారు.
మహబూబ్‌నగర్‌లో సోమవారం సాయంత్రం రైలు కిందపడి తండ్రి, కూతురు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం.. ఏనుగొండలో ఉంటున్న శివానంద్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలపైకి వెళ్లాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన చందనను రైలు ఢీకొట్టడంతో ఇద్దరు రైలు కిందపడి చనిపోయినట్లు తెలిసింది. వీరిద్దరు ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా, ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్నారు.
నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అమ్రాబాద్ మండలం మన్ననూరులో మంత్రులు సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని అన్నారు. జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేర్ లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 9.3 మి.మీ, గద్వాల జిల్లా మల్దకల్లో 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సెరివెంకటాపూర్ లో 4.0 మి.మీ నారాయణపేట జిల్లా కోటకొండలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పాలమూరు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతను బట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకు రూ.1.75 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. చెరువులు, కుంటల వద్ద మట్టిని, గుట్టలను తొలిచి వచ్చిన మట్టిని ఇసుకగా మారుస్తున్నారు. మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షాకాలం వస్తుందంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన గణాంకాల ప్రకారం 46,701 పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయి. నూతన ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో డాక్టర్స్ డే రోజే విషాదం నెలకొంది. నవాబ్ పేట PHCలో గుండెపోటుతో ఏఎన్ఎం మృతిచెందింది. ఏఎన్ఎం కృష్ణవేణి(34) సోమవారం ఉదయం ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న డా.నరేశ్ చంద్ర సీపీఆర్ చేసి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణవేణికి భర్త, కుమారుడు ఉన్నారని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిబ్బంది కోరారు.
Sorry, no posts matched your criteria.