India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR: రెగ్యులర్, ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ల గడువు ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూలై 31వ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ నెల 30న మొదటి దశ అడ్మిషన్ల ముగింపు ఉండగా, బోర్డు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి రెండోదశ అడ్మిషన్లు ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
PU ఏర్పడి 16ఏళ్లు గడుస్తున్నా కనీసం వసతులు కరవయ్యాయి. ఎక్కడ చూసినా సమస్యలు కనిపించేవి. పీయూ లైబ్రరీలో సైతం అరకొర పుస్తకాలే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష స్కీమ్ ద్వారా ఈ ఏడాది రూ. 100 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ వివిధ విభాగాల్లో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది విధులు నిర్వహించిన 285 మంది అతిథి అధ్యాపకులు విధుల్లో చేరారు. దీంతో 28న గతేడాది పని చేసిన అతిథి అధ్యాపకులను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి జిల్లా లోని 59 జూనియర్ కళాశాలల్లో 285 మందిని జులై 31 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని FSIB సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం SBI ఎండీగా ఉన్న ఆయన గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. ఆయన ఇంటర్ వరకు ఆలంపూర్, గద్వాలలో చదివారు. రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన శెట్టి.. ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా 1988లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరడంతో గ్రేడ్. అయితే ఛైర్మన్ ఎన్నికపై కేంద్రానిదే తుది నిర్ణయం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. T-20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ.. దేశాభిమానాన్ని చాటుకున్నారు. టపాసుల శబ్దాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా మారుమోగింది.
ఈ వానాకాలంలో జున్ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై 24 రోజులు అయినా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో 3,23,533 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అక్కడక్కడా కురిసిన వర్గాలకు 40 శాతం మేర అంటే 74,905 ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు శనివారం మోతీలాల్ నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని, గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున తీసుకోవాలని ఫైరయ్యారు.
అమ్రాబాద్ నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులు జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు టైగర్ సఫారీ టూర్‌ను వాయిదా వేసుకోవాలని, వణ్యప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా ఈ సమయంలో సఫారీ టూర్‌ను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ 3నెలలు శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వాహనాల వేగం 30కి మించరాదని, వన్యప్రాణుల స్వేచ్ఛకు ఎవరూ భంగం కల్గించరాదన్నారు. వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ, అటవీ సంపద, పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు.
వనపర్తి జిల్లాలో ప్రతి అక్రిడిటేషన్ జర్నలిస్ట్ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఉచిత విద్య, మరొకరికి 50% ఫీజు రాయితీతో విద్యను బోధించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. అమలుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మండల విద్యాధికారులను ఆదేశించారు. TUWJH -143 యూనియన్ జిల్లా కమిటీ రిప్రజెంటేషన్ మేరకు ఈ సర్క్యులర్ విడుదల చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.