Mahbubnagar

News May 2, 2024

NRPT: ‘కార్మికులు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

కార్మికుల సంక్షేమం కొరకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ అన్నారు. బుధవారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం కొరకు 15100 నంబరుకు ఫోన్ చేసి సమస్య వివరిస్తే న్యాయ సహాయం అందిస్తారని చెప్పారు.

News May 1, 2024

BRS విజయం ఖాయం: RS ప్రవీణ్ కుమార్

image

అధికార కాంగ్రెస్, మతతత్వ BJPలు ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని BRS కైవసం చేసుకుంటుందని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం వెల్దండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని విమర్శించారు.

News May 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒మరికల్: సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
✒ఉమ్మడి జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు
✒మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి: దీపాదాస్ మున్సీ
✒ఫారుక్‌నగర్: రైల్వే ట్రాక్‌పై మృతదేహం
✒ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వహించాలి:NGKL ఎస్పీ
✒ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒కాంగ్రెస్ గారడీ మాటలతో ప్రజలు మోసపోయారు:RSP
✒MP ఎన్నికలు.. స్పీడ్ పెంచిన ఎంపీ అభ్యర్థులు, నేతలు

News May 1, 2024

రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల సందర్భంగా జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, కరాటే కిక్ బాక్సింగ్ వంటివి నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News May 1, 2024

మరికల్: సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

image

మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ సెంటర్‌లో సోడా సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యూస్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు సోడా సిలిండర్ పేలింది. దీంతో జ్యూస్ తాగేందుకు నిలిచి ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గోపాల్ కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అటు ఎండల వేడిమికి రోడ్లు సెగలు కక్కుతున్నాయి. ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు తారు రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News May 1, 2024

కొల్లాపూర్: కార్మికులను సన్మానించిన మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మేడే కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల జీవితాలలో నేటికీ పురోగతి లేదన్నారు. దీనికి గత పాలకులే కారణం అన్నారు. కార్మికుల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసి వారిని సన్మానించారు.

News May 1, 2024

ఫారుక్‌నగర్: రైల్వే ట్రాక్‌పై మృతదేహం

image

ఫారుక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గ్రామ సమీపంలోని మజీద్ వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ పై పడి ఉన్న మృతుడి వయసు 55 నుంచి 60ఏళ్లు ఉంటుందని, అతను తెల్లటి బనియన్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 1, 2024

కేరళకు బయలుదేరిన పీయూ క్రీడాకారులు

image

పాలమూరు యూనివర్సిటీకి చెందిన హ్యాండ్ బాల్ పురుషుల క్రీడాకారులు బుధవారం కేరళ రాష్ట్రానికి బయలుదేరారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ క్రీడలు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు కేరళలో నిర్వహించనున్నారు. ఈ క్రీడాకారులకు పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్, పిడి శ్రీనివాసులు ట్రాక్ షూట్స్, యూనిఫార్మ్స్ అందజేశారు. క్రమశిక్షణతో క్రీడలు ఆడి తల్లిదండ్రులు, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

News May 1, 2024

NGKL: ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వహించాలి: ఎస్పీ

image

సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. SBIREWARDS కానీ లేదా SBI పేరు మీద ఉన్న ఎటువంటి లింక్లను, APPలను ఎవ్వరూ క్లిక్ చేయవద్దన్నారు. అలా క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని, మీ అకౌంట్స్ నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కావున ఎవ్వరూ SBI అని ఉన్న లింక్ పైన క్లిక్ చేయోద్దని ఎస్పీ సూచించారు.