Mahbubnagar

News April 22, 2025

మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

image

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

News April 22, 2025

MBNR: రైతులు అధైర్య పడొద్దు: కలెక్టర్

image

అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.

News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News April 22, 2025

రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

image

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 22, 2025

MBNR: వేసవి కరాటే శిక్షణ శిబిరం

image

వేసవి కరాటే శిక్షణ శిబిరానికి సద్విని చేసుకోవాలని ఉమ్మడి ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్ కోరారు. వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగవచ్చు అన్నారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు.

News April 21, 2025

రైతులకు భూ భారతి భరోసా: కలెక్టర్

image

అడ్డాకల్: పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.

News April 21, 2025

MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

image

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

News April 21, 2025

రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST

News April 21, 2025

MBNR: ‘మోడల్ నీట్ పరీక్షను విజయవంతం చేయండి’

image

దేశ వ్యాప్తంగా మే 4న నీట్ పరీక్ష ఉంది. ఈ క్రమంలో ముందుస్తుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ నీట్ పరీక్ష ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 వరకు, 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12 వరకు MBNRలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ అన్నారు. ఈ పేపర్ ఐఐటీ చుక్కా రామయ్య సంస్థ నుంచి వస్తుందని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News April 21, 2025

నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

image

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.