India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని HP పెట్రోల్ పంప్ వెనకాల భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య శివలీల భర్త శివపై కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. సకాలంలో సేఫ్టీ మెటీరియల్ అందించకపోవడం, ఏబి స్విచ్‌లు మరమ్మత్తులు చేయకపోవడం తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు గ్రామంలోని సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ లక్ష్మణ్ నిన్న విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. ఏబీ స్విచ్‌లు డైరెక్ట్‌గా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు.
ఈ ఏడాది అవినీతి కేసుల నమోదులో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా అవినీతి కేసులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ నెల 26 వరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖకు సంబంధించి మూడు, రెవెన్యూ, విద్యుత్ శాఖలవి రెండు చొప్పున, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలవి ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-2025 విద్యాసంవత్సరానికి డిగ్రీ విద్యార్థులకు భోధించేందుకు అతిథి అధ్యాపకులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విద్యారాణి గురువారం తెలిపారు. పొలిటికల్ సైన్స్-1, కంప్యూటర్ సైన్స్-1, సంస్కృతం-1, బిఏ(ఎల్)తెలుగు-1, తెలుగు-1పోస్టులకు అర్హత గల అభ్యర్థులు జులై1 సాయంత్రం వరకు చేసుకోవాలన్నారు.
ప్రతి బాలిక చదువుకునేలా చూడాలని, బాల్య వివాహాలు అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే నష్టాలను బాలికల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో బాలిక మండలి ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పించాలని డిజిపి రవిగుప్తా అన్నారు. గురువారం హైద్రాబాద్ నుంచి జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్షా అధినియం చట్టాలపై ఇప్పటికే వంద శాతం సిబ్బందికి అవగాహన కల్పించినట్లు డీజీపీకి ఎస్పీ వివరించారు.
√WNP: సైబర్ నేరాల పట్ల ప్రజల ప్రమాదంగా ఉండాలి:SP.√GDL: బావి తవ్వుతుండగా మట్టి కూలి ఒకరి మృతి.√MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.√MBNR: రాజాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం వ్యక్తి మృతి.√SDNR: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి చెందాడని ఆందోళన.√ దౌల్తాబాద్: టీచర్ బదిలీ విద్యార్థుల కన్నీళ్లు.√ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అన్నారు. సైబర్ మోసగాళ్ల బారి నుండి ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించే పోస్టర్లను ఆమె గురువారం ఆవిష్కరించారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తులు మాటలు నమ్మకూడదన్నారు. తెలియని మెసేజీలు, క్లిక్ చేయకూడదని అన్నారు. లాటరీ తగిలిందని, లోన్లు వస్తాయంటూ వచ్చే ఫోన్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.