India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలు పంపుకునే అవకాశం రాఖీ పౌర్ణమి సందర్భంగా సదూర ప్రాంతాలలో ఉన్న తమ సోదరులకు మహిళలు ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలను పంపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఉమ్మడి జిల్లా లాజిస్టిక్స్ ఏటీఎం ఇసాక్ తెలిపారు. రీజియన్ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన మహిళలు రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని పంపేందుకు కార్గో సేవలు వినియోగించుకోవాలని కోరారు.
రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.
PU పరిధిలో ఈనెల 19న జరిగే పీజీ, బీఈడీ, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు PU పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజకుమార్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. 19న జరిగే పరీక్షలను 23వ తేదీన జరుగుతాయని రీ షెడ్యూల్‌ను శనివారం యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమేనని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీల విషయమై కలెక్టర్ కార్యాలయాలలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నా అర్హులకే రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం అని వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గల డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయం సమన్వయకర్త డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు https://www.braouonline.in/PGHallTickets/Halltic వెబ్సైట్లో ఉంచామని తెలిపారు.
ఆర్డర్ చేసిన చికెన్ తీసుకురాలేదని కస్టమర్లకు, యజమానికి మధ్య గొడవ జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన నలుగురు యువకులు మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో చికెన్ ఆర్డర్ చేశారు. డ్రింక్ పూర్తయ్యే వరకు చికెన్ రాకపోవడంతో సీసా పగలగొట్టి గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చేనేత అధికారులు సహకార సంఘాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీని ప్రకారం ఓటరు జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో త్వరలోనే చేనేత, సిల్క్, పవర్ లూమ్, ఉన్ని, టైలరింగ్ సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని రకాల సహకార సంఘాలు కలిపి మొత్తం 64 ఉన్నాయి. వీటిలో సుమారు 8 వేల మందికి పైగా కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారు.
పాలమూరులోని పలు జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-శ్రీశైలం, జడ్చర్ల-కోదాడ రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో 171 ప్రమాదాలు జరగగా.. 92 మంది చనిపోయారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నేటికీ హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
తిరుమల హిల్స్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ఆసక్తి కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నట్లు డైరెక్టర్ డా.రమేశ్ తెలిపారు. ఆచార్యులు, అసోసియేట్, సహాయ ఆచార్యులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీన కళాశాలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరు కావాలని కోరారు.
జిల్లాలో పోడు భూముల పంపిణీపై సమగ్ర వివరాలు అందించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి, పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.