India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని MBNR కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతుందని అన్నారు.
✒పార్లమెంట్‌లో ఎంపీగా డీకే అరుణ, మల్లు రవి ప్రమాణ స్వీకారం
✒NRPT: ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయండి:SP
✒కొడంగల్‌లో ప్రోటోకాల్ వివాదం
✒NGKL: ఉరేసుకొని బాలుడు సూసైడ్
✒రేపు స్కూళ్ల బంద్ ప్రకటించిన ఏబీవీపీ
✒ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు
✒ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి:GDWL ఎస్పీ
✒ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు కల్పించండి:TWJF
ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన MBNR నుంచి డీకే అరుణ, NGKL నుంచి మల్లురవి ఎంపీలుగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. డీకే అరుణ 1994లో టీడీపీ నుంచి, 2019లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో గెలుపొందిన అరుణ(బీజేపీ) తొలిసారి పార్లమెంట్‌లో కాలు పెట్టబోతున్నారు. అటూ 1991, 96లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మల్లు రవి.. 3వ సారి లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
MBNR: పీసీసీ చీఫ్ రేసులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 27తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. గత మూడు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. దీంతో కొత్తగా ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బాలుడు పవన్(17) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొన్నట్లు స్థానికులు తెలిపారు. పవన్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఆల్లంపుర్లో 35.9, వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ 35.9, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 35.8, నారాయణపేట జిల్లా ధన్వాడలో 34.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో కూరగాయల ధరలు కొండెక్కాయి. బీర్నీస్ కిలో ధర రూ.240 ఉండగా, మిగతా చాలా వాటి ధరలు సెంచరీ దాటాయి. రోజూ కూరగాయల్లో వాడే టమాట, పచ్చిమిర్చి ధరలు రూ.100కు చేరాయి. వంకాయ రూ.120, కాకరకాయ రూ.120, క్యారెట్ రూ.80, దొండకాయ రూ.80, ఆలుగడ్డ రూ.50, క్యాబేజీ రూ.60, బెండకాయ రూ.80, దోసకాయ రూ.80, బీట్ రూట్ రూ.60, ఉల్లిగడ్డలు రూ.50గా ధరలు ఉన్నాయి. ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
అచ్చంపేట: పకృతి పర్యాటక అభివృద్ధిపై పర్యాటక శాఖ దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 పర్యాటక సర్క్యూట్లు గుర్తించింది. దీంట్లో నల్లమల్ల ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను గుర్తించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన కొండలు, జలపాతాలు , జల వనరులు ప్రాంతాలను గుర్తించి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో మార్చి నెల నుంచి గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్లులు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాత్రి మన్ననూరు గ్రామంలో జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ వల్ల ఈ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో జీరో బిల్లులు అమలు చేయలేదని భట్టి తెలిపారు.
Sorry, no posts matched your criteria.