Mahbubnagar

News April 30, 2024

ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ కుట్ర: డీకే అరుణ

image

ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. సోమవారం హన్వాడ మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. జూటా మాటలు చెప్పి, 6గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆమె అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

News April 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒MP ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు: MBNRలో 31..NGKLలో 19 మంది అభ్యర్థులు
✒కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: దీపాదాస్ మున్సీ
✒MBNR:రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✒సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త: పోలీసులు
✒లింగాల:వివాహిత దారుణ హత్య
✒లోక్ సభ ఎన్నికలు.. పటిష్ఠ నిఘా:SPలు
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల స్లీప్స్ పంపిణీ
✒పోలీస్ ప్రజావాణి: సమస్య పరిష్కారం పై ఫోకస్
✒ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు

News April 29, 2024

లింగాల: వివాహిత దారుణ హత్య !

image

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన విజయ(37)ను గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయను భర్తతోపాటు కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 29, 2024

కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: దీపాదాస్ మున్సీ

image

మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్సీ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న పార్టీ పరిస్థితిపై ఆమె చర్చించారు. ఈ పది రోజులు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News April 29, 2024

ఫ్రీ బస్సు పేరుతో జనం మధ్య గొడవలు పెడుతున్న కాంగ్రెస్: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపురం, చిన్నదర్పల్లి, నాయినోని పల్లిలో బీజేపి అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని అన్నారు. మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలన్నారు.

News April 29, 2024

రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: ఎంపీ రాములు

image

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బిజెపి బీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సమావేశంలో బీసీ మోర్చ నాయకులు పాల్గొన్నారు.

News April 29, 2024

నాగర్‌కర్నూల్ ఎంపీ బరిలో 19 మంది అభ్యర్థులు

image

నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి 34 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీలో 21 మంది నామినేషన్లు ఆమోదించారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో NGKL ఎంపీ బరిలో 19 మంది నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ఉదయ కుమార్ తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.

News April 29, 2024

రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపురం, చిన్నదర్పల్లి, నాయినోని పల్లిలో బీజేపి అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని అన్నారు. మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలన్నారు.

News April 29, 2024

గద్వాల: ‘వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల జిల్లా వైద్యాధికారిణి డా.శశికళ సూచించారు. వడదెబ్బకు గురికాకుండా సురక్షితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటికి వెళ్తే తెల్లటి బట్టలు ధరిచండం, తరచుగా నీటిని తీసుకోవడం వంటివి చేయాలన్నారు.

News April 29, 2024

REWIND: మహబూబ్‌నగర్ హ్యాట్రిక్ ఎంపీలు వీరే..

image

MBNR పార్లమెంట్‌కు ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్‌ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.