India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 12.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 12.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా మదనపూర్ లో 4.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా బొల్లంపల్లిలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెజ్లింగ్ ఎంపికలు ఈ నెల 30న ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి నర్సింలు తెలిపారు. అండర్-14,17 విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, అండర్-14 విభాగానికి జనవరి 1, 2011, అండర్-17 విభాగానికి జనవరి1, 2008 తర్వాత జన్మించిన వారే అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ బోనఫైడ్‌తో హాజరు కావాలన్నారు.

ఉండవెల్లి మండలం పరిధిలో గల ప్రాగుటూరులో ఫ్రైడే డ్రై కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇంటి పరిసర ప్రదేశాల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వలేకుండా ఉంచుకోవాలని కోరారు. దోమలను నివారించడానికి ఇది సరైన మార్గమని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

దామరగిద్ద మండల పరిధిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతుల వివరాలు.. రెండు రోజుల క్రితం దామరగిద్ద తండాకు సమీపంలో గోన్యనాయక్ అనే రైతుకు చెందిన ఆవుదూడ పై దాడి చేసింది. గురువారం రోజు వత్తుగుండ్లకు చెందిన గొల్ల రాములు మేకలను మేపుతుండగా ఒక్కసారిగా మేకల గుంపుపై దాడి చేసి మేకను గాయపరిచింది. రైతు కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది. పులిని బంధించాలని రైతులు కోరుతున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకొనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌కు అవార్డును ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 1,350 ఏర్పాటు చేశారు.

గద్వాలలో సీనియర్ అసిస్టెంట్ అశోక్ గురువారం ఉరివేసుకున్న విషయం తెలిసిందే. అశోక్ ఇటివలే పెబ్బేరుకు బదిలీ అయ్యారు. ఆర్థిక సమస్యల వల్లే తన భర్త సూసైడ్ చేసుకొని ఉండవచ్చని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కల్యాణ్‌కుమార్ తెలిపారు. కాగా తాను షేర్ మార్కెట్‌లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇందులో తన ఫ్రెండ్స్‌వి రూ.20 లక్షలు ఉన్నాయని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జీవో తెచ్చింది తానేనని, జీవో వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఎంపీ డీకే అరుణ గురువారం అన్నారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితు సరైన న్యాయం చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందించాలని ఆమె అన్నారు. సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని ఆమె అన్నారు.

✒నవాబుపేట: మహిళపై లైంగిక దాడి.. కేసు నమోదు
✒MBNR: ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వేడుకలు
✒సత్తా చాటాలంటే సభ్యత్వాలు పెంచాలి:DK అరుణ
✒పలుచోట్ల వర్షాలు
✒GDWL: ప్రభుత్వ ఆఫీస్‌లోనే ఉద్యోగి సూసైడ్
✒లింగాల: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
✒దామరగిద్ద: చిరుత దాడిలో లేగ దూడ మృతి
✒NRPT: రేపు KGBVలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బొంరాస్ పేట కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఐలమ్మ చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గణేష్, బొంరాస్ పేట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన దేవర సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో హీరో ప్లెక్సీలు, కటౌట్‌లతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. దీనిలో భాగంగా అచ్చంపేటలో శ్రీ సాయిరాం టాకీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హీరో పైన ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Sorry, no posts matched your criteria.