India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు విష జ్వరాలు పెరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి నిన్న ఒక్కరోజే 2,206 మంది వచ్చారు. వీరిలో ఎక్కువ మందికి డెంగ్యీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, సాధారణ ఫీవర్ ఉంది. ప్రస్తుతం 8 మంది డెంగీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, వైద్య సేవలు అందించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని వైధ్యాధికారి తెలిపారు.
UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వనపర్తి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నుషిత మంగళవారం తెలిపారు. ఈ మేరకు రెసిడెన్షియల్ పద్ధతిలో ఇచ్చే శిక్షణకు ఆసక్తి గలవారు UPSC, CSC ప్రిలిమినరీ పరీక్ష 2024 నందు ఉత్తీర్ణులై ఉండాలని, పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ లో చూడాలని చెప్పారు.
తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస ఉత్సవాలు చేపట్టనున్నట్లు తితిదే కార్యక్రమ ఉమ్మడి జిల్లా అధికారి డా.ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. ఈనెల 16న వరలక్ష్మి వ్రతాలు, 19న శ్రావణ పౌర్ణమి విశేష ప్రవచనాలు, 27న గోకులాష్టమి సందర్భంగా గోపూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆయా జిల్లాలలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాలమూరులోని ఆయా జిల్లాల్లో జాతీయ పతాకాలు ఆవిష్కరించే వారి జాబితా వెల్లడైంది. MBNRలో మంత్రి జూపల్లి కృష్ణారావు, GDWLలో ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి, NGKLలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, NRPTలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గురునాథ్ రెడ్డి, WNPTలో రాష్ట్ర షెడ్యూల్ కులాల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతమ్ ఆవిష్కరించనున్నారు.
సమాజంలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా కృషిచేయాలని, కోర్టు అధికారులను సమన్వయపరుస్తూ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
గుండె పోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన నవాబుపేట మండలం రుక్కంపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన బాలరాజు(42) బుట్టోనిపల్లి తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంగవారం సెలవు పెట్టిన ఆయన తన పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తెలంగాణలో విజయ డైరీ ధ్వంసం చేయడానికి కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా విజయా డైరీకి పాలు పోస్తున్న రైతులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హాయంలో విజయా డైరీ లాభాల్లో ఉండే దన్నారు.
NGKL జిల్లాలో మొత్తం 848 స్కూళ్లు ఉండగా 170 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. మరో 80 బడుల్లో 10లోపే విద్యార్థులు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ బడుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని మారుమూల చెంచుగూడాలు, గిరిజన తండాల్లో విద్యార్థులకు విద్య అందరిని ద్రాక్షగా మిగిలింది. 50 బడుల్లో కొత్తగా ఒక్క నమోదు లేదని తెలుస్తోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అలంపూర్ క్షేత్రంలోని నవబ్రహ్మ ఆలయాలన్నింటినీ భక్తులు ఏకకాలంలో దర్శించుకోలే పోతున్నారు. భక్తులు ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రదిక్షణ పథంలో ఈ ఆలయాలన్ని దర్శించుకునేలా ఒక ప్రదక్షణ మార్గాన్ని రూపొందించాలని భక్తులు కోరుతున్నారు. అలంపూర్ ఆలయాలకు ఎన్ని సార్లు వచ్చినా ఏ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాకపోవడంతో దర్శించుకోలేని పోతున్నామని భక్తులు అంటున్నారు.
ఓ మహిళ మద్యం మత్తులో కన్నబిడ్డలనే చంపేందుకు యత్నించింది. స్థానికుల వివరాలు.. బాలానగర్ మం. చిన్నరేవల్లికి చెందిన యాదయ్య, పార్వతమ్మ దంపతులు వారి ఇద్దరు పిల్లలతో సోమవారం జడ్చర్లకు వచ్చారు. భర్త వదిలి వెళ్లగా స్థానిక రైలు పట్టాలపై ఓ పాపను ఉంచి మరో బిడ్డ గొంతు నులిమే ప్రయత్నం చేయగా ఓ వ్యక్తి అడ్డుకొని ముగ్గురినీ పక్కకు తీసుకొచ్చాడు. జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా ఆమె మద్యం తాగిందని వైద్యులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.