India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 108 మంది నాయబ్ తహసీల్దార్ల(డిప్యూటీ తహసీల్దార్లు)కు జిల్లాలు కేటాయిస్తూ భూపరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. MBNR-31, NGKL-27, వనపర్తి-16, జోగులాంబ గద్వాల-20, నారాయణపేట-14 మందిని కేటాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో సీనియర్ అసిస్టెంట్లు, కొందరు నాయబ్ తహసీల్దార్లుగా పనిచేస్తూ ఇదివరకే పదోన్నతి పొందారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) కోసం 8వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో గోవిందరాజులు తెలిపారు. ఈ అవకాశం సెప్టెంబరు 11 వరకు ఉంటుందని, నవంబరు 24న అన్ని డివిజన్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50, ఓసీ, బీసీలు రూ.వంద దరఖాస్తు ఫీ చెల్లించాలని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తారన్నారు.
మాదకద్రవ్య రహిత సమాజం నిర్మిద్దామని పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం పాలమూరు యూనివర్సిటీలో మాదకద్రవ్యాలపై అవగాహన నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, మాదకద్రవ్యాల బారిన పడితే ఒక కుటుంబం పూర్తిగా నాశనం అవుతుందని, మానవ శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌కు హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తున్నాయి. సోమవారం మక్తల్‌లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నేడు ఉమ్మడి జిల్లాలోని మద్దూర్, కోస్గి, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, తదితర ప్రాంతాల్లో బంద్ చేపట్టాయి. ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారం రోజుల్లో పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో మౌలిక వసతులను పర్యవేక్షించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 4, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
ప్రతి పౌరుడు ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేసి భారత జాతీయ సమైక్యతను చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళ మోర్చా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో దేశ ప్రజలందరం ఐక్యంగా ఉన్నామని చాటిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. భావితరాల వారికి దేశభక్తి స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందని డీకే అరుణ అన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 2.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 1.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాల్ పాడు 1.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా ఎళ్లికల్లి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
జోగులాంబ ఆలయానికి దర్శనార్థం వచ్చే భక్తులు ఎవరూ తుంగభద్ర నదిలో స్నానాలకు దిగొద్దని ఈవో పురేందర్ కుమార్ సూచించారు. తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం అలంపూర్ వద్ద పుష్కర ఘాట్‌ను ఈవో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. భక్తులు ఆలయం దగ్గరలోనే స్నానపు గదులు ఉన్నాయని, అక్కడే స్నానాలు ఆచరించాలన్నారు. ఆలయ సిబ్బంది పుష్కర్ ఘాట్ దగ్గర భక్తుల కదలికలను గమనించాలన్నారు.
అలంపూర్ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలోకి నేటి నుంచి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీఐపీలు కూడా బయట పార్కింగ్ ప్రాంగణంలో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే వీటితోపాటు పురావస్తు శాఖ స్థల ప్రదర్శనశాల, నవబ్రహ్మ ఆలయాలు వెళ్లే మార్గానికి భక్తులు, సందర్శకుల సౌకర్యంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.