India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమేనని BRS నేత RS ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరుగుతుంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్ జిల్లా రేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొంకలపల్లికి చెందిన మాధవి(21) తొలి కాన్పుకు రాత్రి 1:30 గంటలకు రేవల్లి ఆసుపత్రికి వచ్చింది. ఇవాళ ఉదయం 9గంటలకు ఆమె ప్రసవించగా పుట్టిన బిడ్డ చనిపోయాడు. కాగా ప్రసవ సమయంలో బిడ్డ చుట్టూ పేగు తాడు ఉండడంతో చనిపోయాడని ఆసుపత్రి సూపరిండెంట్ రాజకుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా టి.జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొ. కె.జయశంకర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలన్నారు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా అలంపూర్లో 37.8, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్లో 37.5, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 36.8, నారాయణపేట జిల్లా కృష్ణలో 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజోలిలో సుంకేసుల జలాశయంలో గుర్తుతెలియని మృత దేహం శవం లభ్యమైనట్టు రాజోలి ఎస్సై జగదీశ్ తెలిపారు. వివరాల ఇలా.. సుంకేసుల బ్యారేజీ దగ్గర ఉదయం మృతదేహం ఉన్నట్టుగా సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టామన్నారు. బ్యారేజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా..! లేక ఎగువ నుంచి మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందా అనే పలు అనుమానాలతో కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
డా.బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్-1 ప్రయోగ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని రీజినల్ జిల్లా కో-ఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరు కావాలని తెలిపారు.
వానాకాలం, యాసంగి 2022-23 సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను(సీఎంఆర్) ఈనెల 26లోగా అందించాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో అధికారులు, రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీలోగా రైస్ మిల్లర్లు బియ్యంను ఎఫ్సీఐకి పంపాలని, ధాన్యం నిలువలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యువకుడు అదృశ్యమైన ఘటన షాద్ నగర్ పరిధిలోని కొందుర్గులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంగడపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు ఠాను(20) డిగ్రీ చదువుతున్నాడు. 18న డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. అనంతరం ‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. మళ్లీ సంవత్సరం తర్వాత వస్తా’ అంటూ లెటర్ రాసి తన బైక్ తీసుకొని వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశారు.
డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఏనుగొండ చెందిన మున్సిపల్ కార్మికుడు చంద్రయ్య హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీలో మరమ్మతు పనుల కోసం దిగగా అక్కడే మరణించాడు. సాటి మున్సిపల్ కార్మికులు అతని కోసం వెతికారు. తీరా చూస్తే డ్రైనేజీలో చూడడంతో శవమై కనిపించాడు.
ఉమ్మడి జిల్లాకు 2021లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మామిడి క్లస్టర్ మూడేళ్లుగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,284 మంది మామిడి రైతులు 57,344 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అయితే స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందున క్లస్టర్ నిర్మాణాన్ని చేపడతారని రైతులు ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.