India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొల్లాపూర్ మండలంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మొలచింతపల్లిలో ఈశ్వరమ్మ, ఈరన్న దంపతుల మధ్య గొడవ జరగగా.. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వాకబు చేశాడు. అయితే వీరి పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆమెను తీసుకొచ్చి బంధించినట్లు తెలిసింది. ఆమెను వివస్త్రను చేసి మరీ శరీరంపై వాతలుపెట్టి పచ్చికారం పూశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా.. NASC ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 229 మంది ఎస్ఏలు, జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, ఎన్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతలు, ఎస్జీటీల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని 3,230 పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో సుమారు 700 మందికి పదోన్నతులు పొందనుండగా మరో 8 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున డిగ్రీ దోస్త్ సహయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఇలా
☞MVS-MBNR – 9440831875, 8977980981
☞ WNP – 9490000670, 9491167549
☞NGKL – 9440842201, 9963375850
☞GDWL – 8008259385, 8019826401
☞NRPT – 9440937053, 9959381282 దోస్త్ సహాయ కేంద్రాల కొరకు ఫోన్ నం. సంప్రదించాలన్నారు.
PU పరిధిలో 23 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 1 స్వయం ప్రతి పత్తి కళాశాల, 57 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 31,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల్లో 4,498 మందికి మొదటి విడతలో సీట్లు కేటాయించగా.. నిర్దేశిత గడువు ముగిసే సమయానికి 3,238 మందే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో దఫాలో 2,646 మందికి సీట్లు కేటాయించారు.
జిల్లా కేంద్రలోని MVS డిగ్రీ కళాశాల UG డిగ్రీ సెమిస్టర్ 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 1,2,3,4,5,6 సెమిస్టర్ బ్యాగ్‌లాగ్ ఫలితాలను బుధవారం PU ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలలో 2వ సెమిస్టర్‌లో 919 మందికి 355, 4వ సెమిస్టర్‌లో 935 మందికి 489, 6వ సెమిస్టర్‌లో 919 మందికి 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను MVS డిగ్రీ కళాశాల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బుధవారం ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధార్థ రెడ్డి, తదితరులు ఉన్నారు.
అచ్చంపేట: సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల బాలబాలికలకు ఉచితంగా నీటిలో లాంగ్ టర్న్ కోచింగ్ ఇస్తున్నట్లు గురుకులాల ఆర్సీఓ వనజ బుధవారం తెలిపారు. షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి నీట్ పరీక్షకు హాజరైనవారు www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్లో రూ.200. చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతూ బాసర IIIT కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చాలా సంవత్సరాల నుంచి రిమోట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని, సేవలను గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ ఎస్పీ హర్షవర్ధన్‌కి జిల్లా పోలీస్ సిబ్బంది బుధవారం ఘనంగా వేడుకలు పలికారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హల్ నందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 8నెలల కాలంలో సిబ్బంది సహకారంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఘనత హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరికీ దక్కుతుందన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్డులో శ్మశానవాటిక ఎదురుగా అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే అప్పటికే ఆడశిశువు మృతి చెందింది. స్ధానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.