India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరు యూనివర్సిటీ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా సూక్ష్మ జీవ శాస్త్రం విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్‌ను నియమిస్తూ వీసీ ప్రొ. శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ కిషోర్ గతంలో చీఫ్ వార్డెన్‌గా, సంయుక్త సంచాలకులుగా, పాలకమండలి సభ్యులుగా, ప్రిన్సిపాల్‌గా, విభాగాధిపతిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణలో స్థానిక సంస్థలలో కల్పించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనను స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఈనెల 22న మహబూబ్‌నగర్ ఐడీఓసీ కార్యాలయానికి రానున్నారని వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ సంఘాల సభ్యులు అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
నారాయణపేటలో ఈనెల 20న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సంగీత నాటక అకాడమి ఛైర్మెన్ సంగీత పుంజాల ఆధ్వర్యంలో అంజనా ఫంక్షన్ హాలులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సౌండ్, లైటింగ్, కళాకారులు బస చేసేందుకు వసతులు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం MPW వర్కర్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ప్రతి ఒక్కరు గ్రామ కృషి చేయాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేటట్టు కృషి చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కొలుగూరి సత్యనారాయణపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఈడికి ఫిర్యాదు చేశారు. కొడంగల్ ఫార్మా కంపెనీలో రేవంత్ రెడ్డి అల్లుడికి భాగస్వామ్యం ఉందని ఆధారాలతో సహా బీఆర్‌ఎస్‌నేత క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. MAXBIEN కంపెనీలో సీఎం అల్లుడు డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మాడుగుల మండలం నాగిళ్లలో బావ, బావమరిది హత్యకు గురికాగా.. కడ్తాల్ మండలానికి చెందిన మహేశ్, రాజు ఆగి ఉన్న లారీని ఢీకొని చనిపోయారు. చింతలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్య, మర్ల యాదయ్య గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయారు. వెల్జాల్ చెరువులో పడి మరో వ్యక్తి మరణించాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నవాబుపేటలో 13.5 డిగ్రీలు, దామరగిద్ద 13.7, బాలానగర్ మండలం ఉడిత్యాల 13.9, మిడ్జిల్ మండలం దోనూరు 14,9, కోస్గి 14.4, తలకొండపల్లి 14.9, తెలకపల్లి 15.8, తాడూరు 15.9, తిమ్మాజిపేట 16.1° వెల్దండ 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన శివ(19), విజయ్(20) లు ఇద్దరు స్నేహితులు. శనివారం శివ కొత్త బైక్ కొనడంతో ఆదివారం వీరు కలిసి నాగర్‌కర్నూల్ మైసమ్మ వద్ద పూజ చేయించి తిరిగి తమ గ్రామానికి వస్తున్నారు. ఈక్రమంలో లారీ ఢీకొనడంతో వారిద్దరూ స్పాట్‌లోనే మరణించారు.
బాలానగర్ మండలం మోదంపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సయ్యద్ ఖలీమ్, లింగం అనే వ్యక్తులు తాగిన మైకంలో స్థానిక శివాంజనేయ దేవాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. దీంతో దేవాలయ పవిత్రతను అపవిత్రం చేశారని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్ తరలించామని ఎస్సై రవి తెలిపారు.
ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మండలంలోని మంగళ్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నకేశవ కాలానికి చెందిన వరికుప్పల యాదయ్యతో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.