India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరంగాపురంలోని రంగసముద్ర జలాశయం దాదాపు 3 కి.మీ. పొడవైన ఆయకట్టుతో పాటు ఆలయానికి మూడు వైపులా నీరు ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కట్ట వెంబడి విద్యుద్దీపాలు, సేదతీరేందుకు బెంచీలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి మినీ ట్యాంక్ బండ్‌గా మారిస్తే జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.
విహారయాత్ర ఓ యువకుని కుటుంబంలో విషాదం మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాన్‌గల్‌కి చెందిన ఏడుగురు యువకులు స్నేహితులతో కలిసి జూరాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని మట్టి రోడ్డుపై వస్తుండగా మూలమల్ల గ్రామం వద్ద కారు బోల్తాపడింది. ఈ ఘటనలో రోహన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆరుగురికి గాయాలైయాయని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 51.8 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తీమాన్ దొడ్డిలో 41.5 మి.మీ, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో 21.5 మి.మీ, నారాయణపేట జిల్లా కోటకొండలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
సివిల్ సర్వీసెస్-2025 పరీక్ష రాసే అభ్యర్థులకు HYDలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట జిల్లాలకు చెందిన డిగ్రీ పాసై, ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి తమ పేర్లను www.tgbc-studycircle.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్‌పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై హరి ప్రసాద్ కథనం ప్రకారం.. కుర్మయ్య (41) అనే వ్యక్తి మంగళవారం కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ఊరు పక్కనే ఉన్న బావిలో చేపల వేటకు వెళ్లారని, చేపలు పడ్డాయని బావిలోకి దిగి చూడగా కాళ్లకు వల్ల చుట్టుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్‌శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మద్దూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మండలంలోని చెన్నరెడ్డిపల్లి, మోమినాపూర్ శివారులో చిరుత సంచరిస్తుందని ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించడంతో ప్రజలకు భయం పట్టుకుంది. చిరుతలతో జాగ్రతగా ఉండాలే తప్పా, పొలం కంచెలకు షాక్ పెట్టడం, విష ప్రయోగాలు చేసి చిరుతల మృతికి కారణమైతే రూ.10లక్షల జరిమానా, కేసులు పెడతామని బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
సివిల్ సర్వీసు-2025 సంవత్సరంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎ.స్వప్న, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి ఆర్.ఇందిరా తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని కోరారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించని కారణంగా 14 మందికి కలెక్టర్ సంతోష్ షోకాజ్ నోటీసు జారీచేశారు. మంగళవారం ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన ఆయన సిబ్బంది గైర్హజరయిన విషయాన్ని గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను ఆరాతీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు 3 నెలల క్రితం తనను ప్రేమ వివాహం చేసుకొని ఇప్పుడు కలిసి ఉండటం ఇష్టం లేదని చెబుతున్నాడని తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ, యువకుడు సోషల్ మీడియాలో కలుసుకొని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో ఉంటూ జీవనం సాగించారు. ఇటీవల అతడు సొంత ఊరికి వచ్చి, తిరిగి రాకపోవడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Sorry, no posts matched your criteria.