India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్దూర్ మండల పరిధిలోనీ చెన్నారెడ్డిపల్లి, కంసాన్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటూ.. వాటికి హాని తలపెట్టకూడదని మద్దూరు మండల ఫారెస్టు అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. వాటికి నష్టం కల్గించే ప్రయత్నాలు పొలాలకు విద్యుత్తు తీగలు ఏర్పాట్లు, చనిపోయిన జీవాలకు విషప్రయోగం చేస్తే.. రూ.10లక్షల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కొత్త ఎస్పీగా టీ.శ్రీనివాస్ రావు బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 2013 స్టేట్ సర్వీస్ పోలీస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇన్ని రోజులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. కాగా సైబరాబాద్ పరిధిలో పలు కీలక కేసుల ఛేదనలో టీ.శ్రీనివాస్ రావు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన జిల్లాకు రానుండడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా జానకి ధరావత్ రానున్నారు. ఎస్పీ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2007లో 6 నెలల పాటు ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేసిన ఆమెకు MBNRపై అవగాహన ఉంది. 2013లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,975 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి రూ.29.75 లక్షలు కేటాయించారు. బ్యానర్, కరపత్రాల ముద్రణ, ఇతర ఖర్చుల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేశారు. ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుందని అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని మౌలాలి గుట్టలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సోమవారం పరిశీలించారు. మొదటి దశలో 588,రెండవ దశలో 84 మొత్తం 672 డబుల్ బెడ్ రూంలను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్‌కు వివరించారు. 672 గృహాలలో 588 గృహాలు లబ్దిదారులకు కేటాయించినట్లు తెలిపారు.
✒ఉమ్మడి జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు
✒SDNR:చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు!
✒అచ్చంపేట: రోడ్డు పక్కన యువకుడి మృతదేహం
✒MBNR ఎస్పీగా జానకి ధరావత్, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు నియామకం
✒బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లా MLAలు, MPలు
✒విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి:ABVP ✒Way2Newsకు స్పందన.. గండీడ్ మండలానికి బస్సు సౌకర్యం
✒Way2Newsకు స్పందన..MRO కార్యాలయ ఆవరణలో మరమ్మతులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీలు బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, జోగులాంబ గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మహబూబ్ నగర్ ఎస్పీగా విధులు నిర్వహించిన హర్షవర్ధన్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, గద్వాల ఎస్పీగా పని చేసిన రితిరాజ్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియమించింది.
షాద్‌నగర్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.
అచ్చంపేట మండలం లింగోటం పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి పక్కన అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. మృతుడు ఉప్పునుంతల మండలం కట్లబండ తండాకు చెందిన గణేష్(30)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు జూన్ నెల ఖర్చుల మాసంగా మారింది. రైతులు వ్యవసాయానికి సిద్ధమవడం వల్ల విత్తనాలు, ఎరువులు కొనాల్సి ఉంటుంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో పిల్లలకు బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, తదితరాల కొనుగోలు తప్పనిసరి అవుతుంది. ప్రైవేటుగా చదివిస్తే ఫీజు తడిసి మోపెడవుతుంది. వీటికి తోడు పెరిగిన ధరలు కూరగాయలతో బెంబేలెత్తిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.