Mahbubnagar

News June 17, 2024

వనపర్తి: కల్యాణ గడియల్లో జిల్లాకు బాస్‌గా..

image

జిల్లాకు వచ్చే సివిల్ సర్వీసెస్ అధికారులు కల్యాణ గడియల్లో వస్తున్నారనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. 2023 జనవరి 26న ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రక్షిత కె.మూర్తి నెలరోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 1న జిల్లాకు కలెక్టర్ హోదాలో వచ్చిన తేజస్ నందలాల్ పవార్ నెలరోజుల్లోనే వివాహం చేసుకోగా.. తాజాగా వచ్చిన కలెక్టర్ ఆదర్శ్ సురభి మ్యారేజ్ సైతం జలై 7న జరగనుంది.

News June 17, 2024

జూరాలకు 8,649 క్యూసెక్కుల వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 8,849 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 1,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 17, 2024

MBNR: విద్యార్థులకు నీట్ ఉచిత శిక్షణ

image

సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యుల్ కులాల బాల, బాలికలకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. ఇందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు రూ.200లు చెల్లించి ఆన్ లైన్ లో www.tgswreis. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 17, 2024

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

image

పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News June 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు !

image

♥సర్వం సిద్ధం.. నేడే బక్రీద్ పండుగ
♥రాజోలి:నేటి నుంచి వైకుంఠ నారాయణస్వామి ఉత్సవాలు
♥పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎంపీలు,ఎమ్మెల్యేలు
♥గండీడ్:నూతన బస్సు సౌకర్యం.. ప్రారంభించనున్న నేతలు
♥త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక ఫోకస్
♥అక్రమ ఇసుక తరలింపు పై అధికారుల నిఘా
♥ఉమ్మడి జిల్లాలో.. NMMSకు 257 మంది ఎంపిక
♥ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నూతన అడ్మిషన్లపై అధికారుల నజర్

News June 17, 2024

MBNR: డ్రైనేజీ గుంతలో పడి బాలుడి మృతి

image

రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీ గంతలో పడి చనిపోయాడు. MBNR జిల్లా రాజాపూర్‌కు చెందిన శివ, లావణ్య దంపతుల కొడుకు జశ్వంత్(2) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి సమీప PHC వెనుక ఉన్న డ్రైనేజీ గుంతలో పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు జడ్చర్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబు అప్పటికే చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. బాలుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు మండిపడుతున్నారు.

News June 17, 2024

MBNR: సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDలోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గలవారు http://tsstudycircle.co.in లో ఈనెల 17 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT..

News June 17, 2024

మహబూబ్‌నగర్: నేడు బక్రీద్.. ప్రత్యేక ప్రార్థనలు ఇలా

image

వానగట్టు వక్స్-ఎ-రహమానియా ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు జామా మసీదు నాయబ్ ఇమాం సయ్యద్ ముజాహెద్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జామా మసీదు నుంచి ప్రదర్శనగా వేలాది మంది ముస్లింలు వానగట్టు ఈద్గా మైదానానికి చేరుకుంటారు. ఈ ర్యాలీ ఆకుల చౌరస్తా, గడియారం, పాత బస్టాండు, కలెక్టర్ బంగ్లా చౌరస్తా, బోయపల్లి గేట్ మీదుగా వానగట్టు ఈద్గాను చేరుకుని 8.30 గంకు నమాజు నిర్వహిస్తారు.

News June 17, 2024

NMMS ప్రతిభా పరీక్షలో పాలమూరు విద్యార్థుల సత్తా

image

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌-NMMS ప్రతిభా పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. 2023-24 ఏడాదికి మొత్తం 620 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 257 మంది ఎంపికయ్యారు. ఇందులో MBNR జిల్లా నుంచి అధికంగా ఉన్నారు. దీంతో 5 జిల్లాల పరిధిలోని 257 మందికి 4ఏళ్లలో రూ.1.23 కోట్లు స్కాలర్‌షిప్‌ రూపంలో అందనున్నాయి. ఇవి వారి స్టడీకి ఎంతగానో ఉపయోగపడనుండగా, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది.

News June 17, 2024

వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొవాలి: కలెక్టర్ విజయేంద్ర

image

విద్యార్థినీలు తాము ఎంచుకున్న వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొని కష్టపడి చదవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర అన్నారు. ఆదివారం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ, మైనార్టీ బాలికల విద్యాలయం, అర్బన్ జూనియర్ కళాశాలను సందర్శించారు. కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించాలని, ఆసక్తి ఉన్న రంగంలో రాణించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం వంట గదిని పరిశీలించి, మెనూ తెలుసుకున్నారు.