India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య, రాగాయిపల్లి చెందిన గిరి ఇద్దరూ కలిసి బైక్ పై ఆమనగల్లు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాడుగుల రోడ్డులో 2 బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి . అయితే రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 37.7, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో 36.7, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 36.5, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 36.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన MBNR జిల్లా పరిధి ధర్మాపూర్ సమీపంలో జరిగింది. SI విజయ్ కుమార్ కథనం మేరకు.. తౌసిప్(20) అనే వ్యక్తి తోటి విద్యార్థి ఖలీలతో కలిసి ఓ ఇంజినీరింగ్ కళాశాల నుంచి బైకుపై ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో ధర్మాపూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తౌసిప్ మృతి చెందగా.. ఖలీల్ చికిత్స పొందుతున్నాడు.
నీటి గుంతలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి (48) తన పొలంలో నీటి గుంతలో అమర్చిన మోటర్‌కు పట్టిన నాచును తొలగించి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి పొలానికి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉన్న ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాకు కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కుదరగా, వచ్చే నెల 7న వివాహం చేసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన త్వరలో కలెక్టర్ హోదాలో ఇంటివాడు కానున్నారు. కాగా.. ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్న తేజస్ నందాల్ పవార్ గతేడాది కలెక్టర్ హోదాలోనే వివాహం చేసుకున్నారు.
మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ( PG MA, M.com, M.sc) మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 15 నుంచి జూలై 7 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని కో ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
√ ఊట్కూర్: భూ తగాదాల కారణంగా హత్య:ఎస్పీ.
√NGKL:నూతన కలెక్టర్ గా సంతోష్.
√NRPT:నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్.
√MBNR:నూతన కలెక్టర్ గా బి.విజయేంద్ర.
√WNP:నూతన కలెక్టర్ గా ఆదర్శ్ సురభి.
√ నీతినిబద్ధతతో అధికారులు సేవలు అందించాలి: మంత్రి జూపల్లి.
√ నందిగామ: పట్టపగలు దేవాలయంలో చోరీకి యత్నం.
√ మన్యంకొండ, చిన్న రాజమూరు అంజన్నను దర్శించుకున్న ఎంపీ DK.అరుణ.
√నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు.
నీతి, నిజాయితీ నిబద్ధతతో అధికారులు ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పెద్దకొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గదులు పుస్తకాలు, దుస్తులు, భోజనం, తగినంతమంది టీచర్లను నియమిస్తామన్నారు. ఎంపీ మల్లురవి, ఎంపీపీ పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూతగాదాలతో నిన్న సంజప్ప హత్యకు గురైన విషయం విదితమే. కాగా నేడు సంజప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.