India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల కింద ముందస్తు సాగుపై ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జూరాలకు వరద నీరు వస్తుండటంతో జలాశయంలో నీటినిల్వ పెరుగుతూ వస్తోంది. నెట్టెంపాడు ఎత్తిపోతలతో పాటు ఉమ్మడి జిల్లాలోని జూరాల అధారంగా ఉన్న ఎత్తిపోతల నుంచి నీటితోడిపోత మొదలైంది. దీంతో రైతులు సాగుకు సిద్దమవుతున్నారు.
మగపిల్లలు పుట్టలేదని, పుట్టిన ఒక కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందని మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన అపర్ణకు ఆలూరుకు చెందిన మైబుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఈనెల 13న భర్త మేస్త్రీ పనికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మద్యం తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు మింగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బొంరాస్ పేట మండలం మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేష్(32) తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల చనిపోయాడు. ఈ మేరకు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు.. X వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధరణి పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ విట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో గద్వాల కలెక్టర్ సంతోష్‌తో పాటు అన్ని మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు. ధరణి సమస్యలు పరిష్కారంపై అందరూ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ సూచించారు. వారం రోజుల్లో జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు.
√NRPT: ప్రత్యర్థుల దాడి ఘటనలో వ్యక్తి దారుణ హత్య.
√ ఊట్కూరు ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.
√ పార్లమెంటులో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ.
√ ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసిన ఎస్పీ.
√ పర్యాటక రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి: మంత్రి జూపల్లి.
√ తెలంగాణ హక్కులపై చంద్రబాబు కుట్ర: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
√ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా బీసీ మేధావుల సంఘం.
ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు.. X వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉట్కూర్ మండలం చిన్నపోర్లలో భూ తగాదాల కారణంగా దాయాదుల మధ్య జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉట్కూర్ ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగిందని బాధితులు ఆరోపించారు. దీంతో శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర హక్కులపై చంద్రబాబు విషం నూరిపోస్తూ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. MLC, MP ఎన్నికల ఫలితాలపై వనపర్తి పార్టీ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అదృశ్య శక్తుల ప్రభావంతో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా తెలంగాణ వ్యతిరేక శక్తి ఆదిత్యదాస్‌ను సీఎం నియమించారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.