Mahbubnagar

News June 14, 2024

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాల్లోని 229 ఉన్నత పాఠశాలల్లో జీహెచ్ఎంలు ఖాళీలు భర్తీ అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 16, నాగర్ కర్నూల్ -81, వనపర్తి-53, జోగులాంబ గద్వాల -30, నారాయణపేట-49 జీహెచ్ఎంలుగా ఖాళీలను భర్తీ చేశారు. ఎస్ఏల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన ఖాళీలను అధికారులు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎస్టీల్లో పదోన్నతి కోసం అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ తాత్కాలిక జాబితా ప్రకటించారు.

News June 14, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్ 15.0 మి.మీ, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 16.5 మి.మీ, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 14, 2024

MBNR: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన బీసీ మేధావుల సంఘం

image

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మహబూబ్ నగర్ జిల్లా బీసీ మేధావుల సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ మేధావుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టాలని అలాగే ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న బీసీలను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News June 14, 2024

నాగర్ కర్నూల్: విద్యార్థి అడవిలో ఆత్మహత్య.!

image

లింగాల మండలంలోని రాంపూర్ పెంటకు చెందిన రాముడు (14) సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారితే పాఠశాలకు వెళ్లే ఆ విద్యార్థి రాముడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. రాముడు బలవన్మరణంపై పలు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

రుణమాఫీ.. పాలమూరులో ఇదీ పరిస్థితి

image

ఆగస్టు 15లోగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల బాకీలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి. గత ప్రభుత్వం రూ.లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేసింది. ముందుగా రూ.50వేల లోపు వారికి, రూ.99 వేల వరకు మాఫీ చేసింది. తాజాగా సీఎం ఆదేశాలతో అధికారులు గైడ్ లైన్‌పై దృష్టి పెట్టారు.

News June 14, 2024

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచండి: కలెక్టర్ ఉదయ్

image

ప్రభుత్వం బడుల్లో అన్ని వసతులు కల్పించడమే కాక అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందుతుందని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ అన్నారు. గురువారం ఉప్పునుంతలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఆమ్మ ఆదర్శ బడుల్లో పనులపై వెంటనే నివేదికలు సమర్పించాలన్నారు.

News June 14, 2024

వనపర్తి: UPSC శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో రాష్ట్రలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖచే UPSC నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ పరీక్ష-2025 శిక్షణకు ఆసక్తి గల వారు https://studaycircle.cgg.gov.in లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News June 13, 2024

ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

@MBNR:MLCగా నవీన్ రెడ్డి ప్రమాణస్వీకారం.
@MLC తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి జూపల్లి.
@ అచ్చంపేటలో అవిశ్వాసం.. కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతి: గువ్వల.
@ కొడంగల్ నియోజకవర్గానికి రూ.73.45 కోట్లు మంజూరు.
@ వనపర్తి: కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా.
@MBNR:ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించండి: కలెక్టర్.
@ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలను కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు.

News June 13, 2024

PU: ‘ఈ ఏడాది నుంచి నూతన కోర్సులు ప్రారంభించాలి’

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓఎస్డి మధుసూదన్ రెడ్డికి గురువారం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విద్యాసంవత్సరం నుండే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఏం, ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సందే కార్తిక్ మాదిగ, పవన్ కుమార్ రెడ్డి, రూప్ సింగ్ నాయక్, మీసాల గణేష్ మాదిగ, బత్తిని రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

కొడంగల్‌కు రూ.73.45 కోట్లు మంజూరు

image

సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీగా నిధులు మంజూరు చేశారు. బీసీ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీకి రూ.25 కోట్లు, పాఠశాలకు రూ.23.45 కోట్లు, బూరాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు.