India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి-44 కొత్తూరు నుంచి పుల్లూరు వరకు విస్తరించి ఉంది. రహదారిపై మొత్తం 37 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో కేవలం 4 చోట్ల మాత్రమే వంతెనలు ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు పంపారు. కానీ ఇవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో హైవేపై ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను రక్షించేందుకు ట్రామా కేంద్రాలు లేవు.

ఉమ్మడి జిల్లాలో పరశురాముడు కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఏది అంటే అది జోగులాంబ గద్వాలలోని జమ్మిచెడు మాత్రమే. ఇక్కడ జమ్ములమ్మ దేవస్థానానికి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. వీరంతా పక్కనే వెలిసి ఉన్న పరశురామ స్వామి ఆలయాన్ని కూడా దర్శించి మొక్కలు తీర్చుకోవడం గమనార్హం.

ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 40,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,755 మొత్తం 67,871 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం నీటిమట్టం 881.7 అడుగుల వద్ద 197.4616 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అమ్మమ్మ మరణంతో చిన్నారులు అనాథలయ్యారు. వడ్డేపల్లి శాంతినగర్ చెందిన కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్(11), భానుప్రకాష్(10) ఇద్దరు పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డ కృష్ణవేణి అనారోగ్యంతో చనిపోగా తాజాగా.. ఆమె తల్లి జయమ్మ మృతితో పిల్లలు అనాథలయ్యారు. కాగా వారిని ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ఇతర విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రకాల ఔషధాలు, అత్యవసర మందులు రోగులకు అందడం లేదు. MBNR- 30, WNP-15, NGKL-35, NRPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఔషధాలు మాత్రం మహబూబ్ నగర్‌లో ఉన్న ఔషధ నిల్వ కేంద్రం నుంచి అరకోరగా సరఫరా అవుతున్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యాశాఖ అనాధగా మారింది. 5 జిల్లాల్లో ఇంటర్ విద్యను పర్యవేక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన జిల్లా ఇంటర్ అధికారులు(DIEO) లేకపోవడంతో ఇన్చార్జులుగా ఉన్నవారు విధులు నిర్వహిస్తున్నారు. వీరు పని చేస్తున్న కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తూ.. జిల్లా ఇంటర్ అధికారిగా కూడా విధులు నిర్వహించవలసి వస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది అనే విమర్శలు ఉన్నాయి.

పాలమూరులో పెద్ద చెరువు 96.11 ఎకరాల్లో విస్తరించి ఉంది. 200 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న ఈ చెరువు అక్రమ నిర్మాణాలతో సగం అయింది. పట్టణం విస్తరిస్తున్న క్రమంలో 1989 నుంచి ఆక్రమణలపై పర్వం ప్రారంభమైంది. దీనిపై ప్రజాసంఘాలు, పౌరసమాజం, ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించారు. అక్రమణలపై కొందరు న్యాయపోరాటం సైతం చేశారు. తాజాగా 40 ఎకరాల చెరువును 64 మంది ఆక్రమించారని సర్వే విభాగం నిర్ధారించింది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం కల్పించడంతో రోజువారీగా ఆర్టీసీ బస్సులలో తీవ్ర రద్దీగా ఉంటున్నాయి. అధిక లోడుతో కాలం చెల్లిన బస్సులు అక్కడక్కడ ఆగిపోతున్నాయి. ప్రయాణం సాఫీగా సాగాలంటే మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్‌కు 75పల్లె వెలుగు బస్సులు అవసరం ఉందని అంచనాతో ఆర్టీసీ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో డీపోలకు నూతన పల్లె వెలుగు బస్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అనేక అక్రమ భవనాలు కూల్చివేయడంతో ఉమ్మడి పాలమూరులో భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 11,360 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.23.81 కోట్ల ఆదాయం సమకూరగా.. ఆగస్టు నెలలో 7,315 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.