India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 992 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. అందులో 410 బస్సులే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. MBNR జిల్లాలో 280, వనపర్తిలో 61, నారాయణపేటలో 32, గద్వాలలో 37 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా 582 బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త మరీ.. మీ పిల్లల బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా..? బస్ డ్రైవర్‌ను అడగండి.!
వనపర్తి జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువులు, విత్తనాల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
✒గద్వాల్: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
✒NGKL:వట్టెం వెంకటేశ్వర స్వామి సేవలో త్రిపుర గవర్నర్
✒బడి బాటపై ప్రత్యేక నిఘా.. నివేదిక పంపండి:DEOలు
✒NRPT:నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ధర్నా
✒వనపర్తి:విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి జూపల్లి వార్నింగ్
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షం
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న భగీరథ నల్లల సర్వే
✒ఆయా మండలాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
బిజినెపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్‌లో సత్తా చాటాడు. ఈ ప్రవేశ పరీక్షలో 150 మార్కులకు గాను 118 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ గ్రూప్-1,2కు ప్రిపేర్ అవుతున్నారు. చదువుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నవీన్ కుమార్‌ను గ్రామస్థులు, పలువురు అభినందించారు.
మానవపాడు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కళ్ళముందు ఆడుకుంటూ కనిపించిన ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు, మద్దమ్మలకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు వీరేశ్ (7)ఉన్నారు. ఎద్దులు పోట్లాడుతూ స్తంభానికి తగలడంతో సర్వీస్ వైర్ కిందపడి ఆ బాలుడికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న కృష్ణానదికి వరద జలాలు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి నీరు చేరడంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వరుసగా పడుతున్న వానలకు కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతోంది. దీనితో ఈ ఏడాది నదికి ఆశించిన మేర వరద జలాలు చేరుతాయని ఆశిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 32.5 మి.మీ, గద్వాల జిల్లా తోతినొనిద్దోడి 32.1 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట 32.1 మి.మీ, వనపర్తి జిల్లా మదనపూర్ 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఓ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఘటన నాగర్‌కర్నూల్‌లో జరిగింది. సదరు మేనేజర్ ఫోన్‌కు వారం కింద ఓ లింక్ రాగా.. దానిపై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీని న్యూడ్ ఫొటోగా మార్చి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు. భయపడిన ఆయన ముందుగా రూ.1.56 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. అయినా వేధింపులు ఆగలేదు. దాదాపు 300 మందికి న్యూడ్ ఫొటో పంపినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.
కొడంగల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి అరకు యాత్రకు వెళ్లిన ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు. మోహన్ రెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం దౌల్తాబాద్‌కు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు. బుధవారం అంతక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే సోమవారం ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 661 ఆవాస గ్రామాలు ఉన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మిషన్ భగీరథపై దృష్టిసారించారు.
Sorry, no posts matched your criteria.