Mahbubnagar

News June 11, 2024

MBNR: బాలికపై లైంగిక దాడి

image

బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబీకుల ప్రకారం.. కేటీదొడ్డి మం.లోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కొండన్న ప్రేమ పేరుతో వేధించంగా బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాకపోగా.. గత మే నెలలో బాలికపై సదరు వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బాలిక DSPకి ఫిర్యాదు చేసింది.

News June 11, 2024

బల్మూరు: RTC డ్రైవర్‌పై యువకుల దాడి

image

గుర్తు తెలియని వ్యక్తులు RTC తాత్కాలిక డ్రైవర్‌పై దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. అమిస్తాపూర్‌కు చెందిన శ్రీనివాసులు నాగర్ కర్నూల్ RTC డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమిస్తాపూర్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద గుర్తు తెలియని నలుగురు యువకులు కారులో వచ్చి బస్సు కారుకు దారి ఇవ్వలేదంటూ డ్రైవర్‌పై దాడి చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు.

News June 11, 2024

NGKL: నామినేటెడ్ పోస్టులపై నేతల్లో ఆశలు !

image

ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టులపై జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులు మొదలుకొని ఇక్కడి ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీలు ఎక్కడ అవకాశం ఉన్నా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇటీవల కొల్లాపూర్ జగదీశ్వర్ రావుకు మైనర్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, ZP వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్‌కు PCB మెంబర్‌గా అవకాశం వచ్చింది.

News June 11, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వారంలో ఫిర్యాదుదారునికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. MBNR కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయా MROలను ఆదేశించారు.

News June 10, 2024

పాలమూరు జిల్లా “TODAY TOP NEWS”

image

✓అలంపూర్: వైభవంగా బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం.
✓ వికారాబాద్ -రాయచూర్ రైల్వే సర్వే పనులు ప్రారంభం.
✓ ఉమ్మడి పాలమూరు జిల్లా మూడు రోజుల వర్ష సూచన.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లో కొనసాగిన ప్రజావాణి.
✓ కేంద్ర మంత్రులను కలిసిన బిజెపి నేత పోతుగంటి భరత్.
✓బొంరాస్ పేట: మహిళా సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు.
✓ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బడిబాట.

News June 10, 2024

ప్రభుత్వ బడుల బలోపేతానికి సహకారం అందించండి.. NRIలకు వినతి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్నారైలు సహకారం అందించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహారెడ్డి కోరారు. అమెరికాలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆట మహాసభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పాఠశాలలలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా పథకం ఫలితాలు ఇస్తుందని చెప్పారు.

News June 10, 2024

MBNR: ఉత్కంఠ పోరులో గెలిచినా.. మంత్రి పదవి దక్కలే !

image

MBNR ఎంపీగా ఉత్కంఠ పోరులో గెలిచిన డీకే అరుణకు కేంద్ర పదవి దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. MBNR లోక్ సభ పరిధిలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరు కాంగ్రెస్ MLAలే ఉండి, సీఎం సొంత జిల్లాలో ఆ అభ్యర్థిపై తలపడి ఉత్కంఠ పోరులో 4500 ఓట్ల మెజార్టీతో అరుణ గెలవడంతోపాటు సీనియర్ నాయకురాలు కావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించినా, రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

News June 10, 2024

ALERT.. పాలమూరు: మూడు రోజులు వర్షాలు !

image

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులతో పాటు 30-40Kmph వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News June 10, 2024

MBNR: వాహనదారులకు DGP సూచనలు

image

వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.

News June 10, 2024

MBNR: గృహజ్యోతి విధి విధానాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గృహజ్యోతి పథకంలో అర్హత సాధించాలంటే ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. దాంతో పాటు తెల్లరేషన్ కార్డు ఉండి, ఆధార్తో లింకు చేసుకుని ఉండాలి. విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు మించినా, బిల్లులు పెండింగ్లో ఉన్నా పథకం వర్తించదు. గృహజ్యోతికి అర్హత పొందనివారు ఆధార్, రేషన్ కార్డులు అప్డేట్ చేసుకుని ఎంపీడీవో లేదా మునిసిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలి.