Mahbubnagar

News June 10, 2024

MBNR: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120 పలుకుతోంది.

News June 10, 2024

MBNR: 3023 మంది అభ్యర్థులు గైర్హాజరు

image

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాల్లో సజావుగా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 15,199 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 12,176 మంది మాత్రమే హాజరయ్యారు. 3023 మంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. అంటే 80.11 శాతం మంది పరీక్ష రాశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

News June 10, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోస్త్ హెల్ప్ లైన్ వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోస్త్ రిజిస్ట్రేషన్ హెల్ప్ లైన్‌కు జిల్లాల వారీగా అధికారుల వివరాలు ఇలా మహబూబ్నగర్ ఈశ్వరయ్య, తేజస్విని ఫోన్ నం. 9440831876, 8977980981, WNP శ్రీనివాస్, యాదగిరి గౌడ్ 9490000670, 9491167549, NGKL మధుసూదన్ శర్మ, ధర్మ 9440842201, 9963375850, GDWL హరిబాబు, అనిల్ కుమార్ 8008259315, 8019826401, NRPT నారాయణ గౌడ్, భీమరాజు 9440837053, 9959381282 నం. సంప్రదించాలని కోరారు.

News June 10, 2024

మాడ్గుల: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన మాడ్గుల మండలంలోని కొల్కులపల్లిలో చోటు చేసుకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ (53) రోజు మాదిరిగానే ఆదివారం పొలం వద్ద కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు గీస్తుండగా మోకు జారి పడిపోయి వెంకటయ్యగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 10, 2024

MBNR: 15 ఏళ్లు పైబడితే..

image

దేశవాప్తంగా 15 ఏళ్లు పైపడిన అన్నిరకాల వాహనాలను స్క్రాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తుంది. ఈ క్రమంలో మొదట 15 ఏళ్ల పైబడిన ప్రభుత్వ వాహనాలపై దృష్టిసారించనుంది. కాగా, 15 ఏళ్లు దాటిన వాహనాలు MHNRలో 42,378, నాగర్‌కర్నూల్ 10,776, వనపర్తి 7,346, గద్వాల 5,508, NRPTలో 7,076 వాహనాలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, త్వరలో ఓ స్పష్టమైన ఆర్డర్ వచ్చే అవకాశం ఉందని RTO రఘుకుమార్ తెలిపారు.

News June 10, 2024

ఇండియా -పాక్ మ్యాచ్.. హాజరైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

image

అమెరికాలో జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వీక్షిస్తున్నారు. అమెరికా పర్యటనలో అనిరుధ్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మ్యాచ్ వీక్షించడానికి వెళ్లారు.

News June 10, 2024

రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆచారి..?

image

కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆయన గత 40 ఏళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైతం పని చేసినట్లు అనుచరులు అంటున్నారు. పార్టీని నమ్ముకున్న ఆచారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

News June 9, 2024

ATA ఉత్సవాల్లో పాలమూరు ఎమ్మెల్యేలు

image

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్సవాలలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడి పెట్టి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

News June 9, 2024

MBNR: గొడుగు చేసిన ఘోరం.. పంచాయతీ సెక్రటరి మృతి

image

బొంరాస్‌పేట మండలానికి చెందిన <<13410192>>గ్రూపు-1 అభ్యర్థి<<>> సుమిత్రాబాయి(29) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వికారాబాద్‌లో పరీక్ష రాసి వస్తుండగా వర్షంతో పాటు గాలి వీసింది. దీంతో బైక్ పై వెనుక ఉన్న సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో ధారూర్ మం. గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు తెలిపారు.

News June 9, 2024

బొంరాస్‌పేట: రోడ్డు ప్రమాదంలో గ్రూప్-1 అభ్యర్థి మృతి

image

గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన ధరూర్ మండలం దోర్నాల దగ్గర జరిగింది. స్థానికుల సమాచారం.. బొంరాస్‌పేట మండల BRS సోషల్ మీడియా అధ్యక్షుడు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర యాలాల మండలం అచ్యుతాపూర్ కార్యదర్శి. వికారాబాద్‌లో గ్రూప్-1 పరీక్ష రాసి వస్తుండగా దోర్నాల వద్ద ప్రమాదం జరిగింది. సుమిత్ర స్వగ్రామం దేవుల నాయక్ తండాలో విషాదం నెలకొంది.