India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై నిఘా పెట్టినట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. వాట్సప్, ఫేస్ బుక్, X, తదితర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ఇతర పార్టీలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొల్లాపూర్ పట్టణంలోని 10 వార్డులో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుని, తీరని అన్యాయం చేసిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటుపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్ఎస్పీకి మద్దతుగా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తి, అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ గెలుపుపై సానుకూల పవనాలు ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.
ఇంటర్ ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అమరచింత మం. సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మం. ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. దీంతో 10రోజులుగా దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది.
నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండల వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ఉమ్మడి జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు పని డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. మొన్నటివరకు ఉదయం 10 గంటలకు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే బుధవారం ఉదయం 10 గంటలకు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణం చల్లబడింది.
హైవే-165పై అడ్డాకుల సమీపంలో స్నేహ కంపెనీ వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న <<13204316>>బస్సు బోల్తా<<>> పడింది. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా.. వారిలో మియాపూర్‌కు చెందిన వంశీ, బెంగళూరుకు చెందిన ప్రజ్ఞా పరిమిత పరిస్థితి విషమంగా ఉంది. అడ్డాకుల పోలీసులు వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారు. లారీని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.
పాలమూరు అంటేనే వలసలకు చిరునామాగా పేరొందిన జిల్లా. ఈ జిల్లా నుంచి సుదూర ప్రాంతాలైన ముంబై, పుణె, సోలాపూర్, భీమండి ప్రాంతాలతోపాటు హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో సుమారు 3.5 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.
ఈసీ ఆదేశాలతో పాలమూరులో రైతు భరోసాకు బ్రేక్ పడింది. ఉమ్మడి జిల్లాలో 11.25 లక్షల మంది రైతులు ఉండగా వారందరికీ ఏటా రూ.1,256 కోట్ల పెట్టుబడి సాయం అందేది. అయితే మంగళవారం వరకు MBNR-2.6 లక్షల మంది రైతులకు రూ.164 కోట్లు, NGKL- 3.6 లక్షల మందికి రూ.370 కోట్లు, GDWL-1.63 లక్షల మందికి రూ. 227 కోట్లు, WNPT-175 లక్షల మందికి రూ.181 కోట్లు, NRPT-1.77 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.225.17 కోట్ల చెల్లింపులు జరిగాయి.
Sorry, no posts matched your criteria.