India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల సెకండ్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం శివపురానికి చెందిన అంజి కర్నూలు నుంచి గురువారం రాత్రి గద్వాలకు వచ్చాడు. శుక్రవారం అంజి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నుంచి గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు అందిస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేసింది. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాలలో గృహ వినియోగదారులకు శుక్రవారం జీరో బిల్లులు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్ఐ మహేశ్ కథనం ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా తాడూర్ మండలం ఐతోల్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి(30) బైక్ పై కల్వకుర్తి వెళ్తున్నాడు. ఈక్రమంలో పొలం పక్కన ఆగి ఉన్న ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కడ్తాల్ మండలం గోవిందాయపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఇద్దరు యువకులు హత్యకు గురైన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివ (27) కారు డ్రైవర్. గుండెమోని శివ (25) HYDలో పనిచేస్తుండేవాడు. గ్రామానికి చెందిన రవి ఈ నెల 4న పుట్టినరోజు కావడంతో వేడుకలు జరుపుకున్నాడు. ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు.. వాటిని వీరు డిలీట్ చేశారు. రవి మిత్రులతో కలిసి ఇద్దరినీ హత్య చేశారు.
ఉమ్మడి జిల్లాలో గురువారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నైరుతి రుతు పవనాల రాక తర్వాత కురిసిన ఓ మోస్తరు వర్షం ఇదే. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. అరగంట పాటు ఎడ తెరపి లేకుండా కురిసిన వానకు జనం ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే వాహనాల హెడ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ లపై ఇంటింటి సర్వేను వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరెట్ లో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంత మందికి నీటి కనెక్షన్ ఇచ్చారు. ఎన్ని ఇళ్లకు ఇవ్వాల్సి వుంది అనే విషయలను సర్వే చేసి మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. సర్వేకు నలుగురు మాస్టర్ ట్రైనర్ లను అందుబాటులో ఉంచామన్నారు.
పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన NGKL జిల్లా వెల్దండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన బేగారి జంగమ్మ (47) విత్తనాలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లింది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ క్రమంలో పిడుగు పడి జంగమ్మ మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
MBNR పార్లమెంట్ స్థానానికి 2009 నుంచి 2024 వరకు 4సార్లు పోటీ చేసిన BRS హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. బీజేపీ ఒక్కసారీ గెలుపొందింది. 2009 ఎంపీ ఎన్నికల్లో KCR, 2014లో ఏపీ జితేందర్ రెడ్డి(BRS), 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) గెలుపొందగా, తాజాగా డీకే అరుణ(BJP) గెలిచి తొలి మహిళా ఎంపీగా రికార్డుకెక్కారు. 2 దశాబ్దాల్లో జరిగిన 4 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్‌ను విజయం వరించలేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లా కడ్తాల్ శివారులో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బట్టర్ ఫ్లై సిటీలో ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన శేషిగారి శివ(24), గుండెమోని శివ(29)గా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని కడ్తాల్ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం క్రింది విధంగా వర్షపాతం వివరాలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా అలంపూర్‌లో 103.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 77.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 48.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.0 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Sorry, no posts matched your criteria.