India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీచందర్ రెడ్డి ఓటమిని కాంగ్రెస్ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడి 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే సీఎం రేవంత్ పాలమూరుపై దృష్టిసారించారు. పాలమూరు- మక్తల్ ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొడంగల్ అభివృద్ధికి నిధులు ఇచ్చారు. అయినా 5నెలల్లోనే పరిస్థితులు తారుమారు కావడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.
పెబ్బేరులో రాజేందర్ గౌడ్‌పై హత్యాయత్నం కేసుకు పోలీసులు ఛేదించారు. SI హరిప్రసాద్ రెడ్డి వివరాలు.. రాజేందర్, భార్య ప్రత్యూషతో కలిసి ఓ స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ PET మహేశ్‌తో ప్రత్యుషకు వివాహేత సంబంధం ఉన్నట్లు గుర్తించిన రాజేందర్ పలుమార్లు హెచ్చరించారు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రాజేందర్ హత్యకు ఈనెల 1న ప్లాన్ చేయగా బెడిసికొట్టింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.
బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలవడంతో ధన్వాడ ఆడపడుచులు ప్రజాప్రతినిధులుగా రాణించారు. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపడుచులు శాసనసభ, లోక్ సభలో ఒకేసారి ప్రతినిత్యం వహిస్తుండటం విశేషం. డీకే అరుణ మేనకోడలు చిట్టెం పర్ణిక రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పేట కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తాజాగా అరుణ MBNR ఎంపీగా గెలిచారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో ధన్వాడకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన డీకే అరుణకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఆమెకు మహిళా కోటలో మంత్రి పదవి వస్తుందని నమ్మకంతో ఆమె అనుచరులు గుసగుస లాడుతున్నారు. మరీ బీజేపీ కేంద్రం జేజమ్మకు మంత్రి పదవి ఇస్తుందా.? లేదా.? అనే విషయంపై ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.
✔మహబూబ్‌నగర్‌లో ఓటమికి బాధ్యత నాదే: సీఎం రేవంత్ రెడ్డి
✔సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలి:DK అరుణ
✔సీసీకుంట: ఊయల చీర బిగుసుకొని చిన్నారి మృతి
✔CM రేవంత్ రెడ్డిని కలిసిన మల్లు రవి
✔BRSలో చేరినందుకు గర్వంగా ఉంది: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
✔ఆయా జిల్లాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
✔విద్యార్థుల యూనిఫామ్ పంపిణీపై అధికారుల ప్రత్యేక ఫోకస్
డీకే అరుణ MBNR తొలి మహిళా MPగా రికార్డు సృష్టించారు. సమీప అభ్యర్థి చల్లా వంశీపై కేవలం 4500 (0.37%) ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలో ఇదే అత్యల్ప మెజార్టీ. ఇక్కడ 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. రామేశ్వర్ రావు, మల్లికార్జున్ గౌడ్ 4సార్లు, ఎస్. జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి 2సార్లు, జనార్దన్ రెడ్డి, ముత్యాల్ రావు, విఠల్ రావు, KCR, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఒక్కోసారి MPగా గెలిచారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా MBNR ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదు రాష్ట్రానికి అని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలుపు ఓటములకు తానే బాధ్యుడిని అని చెప్పారు. ముఖ్యంగా సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఫలితానికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలల వ్యవధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న BJP వేగంగా పుంజుకుంది. MBNRలో విజయం సాధించింది. NGKLలో రెండో స్థానంలో నిలవడమే కాక రికార్డు స్థాయిలో ఓట్లు సాధించింది. దీనికి కారణం ప్రధాన ప్రతిపక్షమైన BRS ఓటు బ్యాంక్ చివరి క్షణంలో BJP వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఫలితాలు రెఫరెండమని, తమకు 14 ఎంపీ సీట్లు వస్తాయని రేవంత్ అన్నారని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు ఉండొచ్చన్న ఆమె.. అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో బీజేపీ అమాంతం తమ ఓటు బ్యాంకును పెంచుకుంది. MBNR లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఒక్కటే ఎక్కువ ఓట్లు సాధించండి. BRS, కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి.NGKL లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఓటు బ్యాంకును పెంచుకోగా.. BRS తన ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఓ మోస్తరుగా తగ్గింది.
Sorry, no posts matched your criteria.