Mahbubnagar

News June 5, 2024

సీసీకుంట: ఊయల చీర బిగుసుకొని చిన్నారి మృతి

image

సీసీకుంట మండలంలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల కురుమన్న కూతురు అనుషిత(11) ఇంటి బయట బాల్ కానీకి చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు ఊయలకు కట్టిన పాప గొంతుకు బిగుసుకుంది. కొంతసేపటి తర్వాత గుర్తించిన తల్లి శైలజ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 5, 2024

MBNR, NGKL: నోటాకు 9,299 ఓట్లు

image

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నోటాకు ఆదరణ తగ్గింది.  మహబూబ్‌నగర్‌లో4330, నాగర్‌కర్నూల్‌లో4969 ఓట్లు మాత్రమే నోటాకు పడ్డాయి. ఈ 2 లోక్ సభ స్థానాల్లో కలిపి 2014లో 21,425 ఓట్లు, 2019లో 24,125 ఓట్లు, 2024లో 9,299 నోటాకు పోలయ్యాయి. 2019తో పోల్చితే ఈ సారి నోటాకు 14,826 ఓట్లు తక్కువగా వచ్చాయి. నోటాకు ఆదరణ తగ్గిందనడానికి తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం.

News June 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్లో 12.0 మి మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 16.0 మి.మీ, గద్వాల జిల్లా ధరూరులో 8.8 మి.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 5, 2024

MBNR: కుటుంబం నుంచి 6వ ప్రయత్నంలో ఎంపీగా డీకే అరుణ

image

డీకే అరుణ తమ కుటుంబం నుంచి ఆరో ప్రయత్నంలో ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. MBNR నుంచి ఆమె 1996లో TDP తరపున పోటీచేసి మాజీ మంత్రి మల్లికార్జున్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అరుణ.. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకు ముందు ఆమె మామ డీకే సత్యారెడ్డి 1962, 71, 77లో మహబూబ్‌నగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆ కల నెరవేరింది.

News June 5, 2024

NGKL: పోటీ ఇవ్వకుండాని బర్రెలక్క ఓటమి

image

నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన శిరీష(బర్రెలక్క) పోటీ ఇవ్వకుండానే ఓడిపోయారు. మొత్తానికి నోటాకు 4,580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆమెకు అప్పట్లో 5,754 ఓట్లు పోల్ కాగా ఎంపీ ఎన్నికల్లో 3,087 ఓట్లే వచ్చాయి.

News June 5, 2024

నేడు పాలమూరు బాలోత్సవ్

image

బాలకేంద్రం వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపులో భాగంగా పాలమూరు బాలోత్సవ్ పేరిట బుధవారం సాంస్కృతిక సంబరం చేపట్టనున్నట్లు బాలకేంద్రం శిక్షకులు తెల్కపల్లి గజేంద్ర, రాజేశ్ కన్న వెల్లడించారు. మహబూబ్ నగర్ కొత్త బస్టాండ్ సమీపంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక మహోత్సవంప్రారంభమవుతుందన్నారు. చిన్నారులతో సంప్రదాయ, జానపద నృత్యాలు, చిత్రకళ ప్రదర్శన ఉంటుందని అన్నారు.

News June 5, 2024

NGKL: పోటీలో లేకుండానే బర్రెలక్క ఓటమి

image

నాగర్ కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క) పోటీలో లేకుండానే ఓడిపోయారు. అసలు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కంటే నోటాకే వచ్చిన ఓట్లే ఎక్కువ. మొత్తానికి నోటాకు 4580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

News June 5, 2024

MBNR: రేవంత్ 10సార్లు పర్యటించినా ఫలితం దక్కలేదు

image

సొంత జిల్లాలో ఎన్నికలను పతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 10సార్లు పర్యటించినా ఫలితం దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతోపాటు MBNR ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి సైతం ఓటమి చెందడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ అలుముకుంది. ఇది రేవంత్‌కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News June 5, 2024

MBNR: నోటాకు తగ్గిన ఆదరణ

image

ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో నోటాకు ఆదరణ తగ్గింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఇష్టం లేనప్పుడు ఓటర్లు నోటాకు ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో నోటాకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు ఓట్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న అభిప్రాయానికి ఓటర్లు వచ్చినట్లు స్పష్టత వస్తోంది.

News June 5, 2024

అన్నిచోట్ల ఓ లెక్క… MBNRలో మరోలెక్క

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌ను బీజేపీ, నాగర్‌కర్నూల్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. కాగా MBNR కౌంటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ తీవ్ర ఉత్కంఠ రేపింది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయింది. చివరకు 7,601 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. అటు NGKLలో మల్లు రవి 94,414 ఓట్లతో ఘనవిజయం సాధించారు.