Mahbubnagar

News April 18, 2024

MBNR: నేడు నామినేషన్లు వేయనుంది వీరే..!

image

BJP అభ్యర్థి డీకే అరుణ నేడు నామపత్రాలు సమర్పించనుండగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గడియారం చౌరస్తా కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. NGKL లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గురువారం బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామపత్రాలు దాఖలు చేయనున్నారు. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ 25న రెండోసారి వేసే నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ హాజరుకానున్నారు.

News April 18, 2024

MBNR: నేడు MVS కళాశాలలో జాబ్ మేళా

image

క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్,MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో,క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్,వీఎన్ ఫెర్టిలైజర్స్,స్పందన స్ఫూర్తి,ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు,హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బయోడేటా ఫార్మ్స్ తో హాజరు కావాలన్నారు.

News April 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔సర్వం సిద్ధం.. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
✔ఉప్పునుంతల:నేటి నుంచి బండలాగుడు పోటీలు ప్రారంభం
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు నామినేషన్లు సమర్పించనున్న డీకే అరుణ, మల్లు రవి, భరత్ ప్రసాద్
✔ధన్వాడ,నర్వ:నేడు కాంగ్రెస్ ఎన్నిక సన్నాక సమావేశం
✔ఎండలు తీవ్రం.. తస్మాత్ జాగ్రత్త:కలెక్టర్లు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వార్షిక పరీక్షలు

News April 18, 2024

MBNR: తాతయ్య స్ఫూర్తితోనే సివిల్స్ కొట్టారు

image

పాలమూరు నుంచి UPSCలో 3వ ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి, 278వ ర్యాంకు పొందిన ఎహతేదా ముఫసిర్(ఆత్మకూర్) ఇద్దరూ తాతయ్యలో స్ఫూర్తితోనే సివిల్స్ కొట్టారు. ఇద్దరూ దిల్లీలోనే డిగ్రీ చదవడం విశేషం. అనన్యరెడ్డి దిల్లీ యూనివర్సిటీలోని మిరిండా హౌజ్లో, ఎహతేదా ముఫసిర్ ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో బీఏలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా వీరిద్దరూ ఎలాంటి కోచింగ్ లేకుండా విజయం సాధించారు.

News April 18, 2024

MBNR: రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేటి నుంచి సందడి

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. MBNRలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) బరిలో ఉన్నారు. NGKLలో భరత్ ప్రసాద్ (BJP), మల్లు రవి (కాంగ్రెస్), RS ప్రవీణ్ కుమార్ (BRS) పోటీలో ఉన్నారు. నామపత్రాలు సమర్పణకు గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుండటంతో పాలమూరులో సందడి నెలకొననుంది.

News April 18, 2024

MBNR: ఈనెల 21న ప్రవేశ పరీక్ష

image

సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 18, 2024

పాలమూరు ప్రజలారా.. దొంగలతో జర జాగ్రత్త !

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణవాసులు ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రతి ఏడాదిలో జరిగే చోరీల కంటే ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోని అధిక శాతం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 18, 2024

MBNR: నేటి నుంచి నామినేషన్ల పర్వం..

image

నేటి నుంచి ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉ. 10 గంటల నుంచి మ. 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.

News April 17, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: డీకే అరుణ

image

పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్ ప్రజలను నట్టేట ముంచాయని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.

News April 17, 2024

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలపాలి: మాజీ మంత్రి

image

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అనేక వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులను 2 లక్షలు అప్పు తీసుకోవాలని వెంటనే మాఫీ చేస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. అలాగే వారి వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేర్చాలన్నారు.