Mahbubnagar

News June 4, 2024

MBNR: ఓటేసిన 12.18 లక్షల మంది

image

మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఎన్నికల్లో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 16, 82, 470 మందికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించగా.. 12, 18, 587 మంది ఓటు వేశారు. మొత్తం 72.43 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఓటరు నాడి పట్టుకో వడం అసాధ్యమైన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు ఎక్కువ కావడంతో పోలింగ్లో డబుల్ బ్యాలెట్ ఈవీఎంలను వినియోగించారు.

News June 4, 2024

MBNR: జిల్లాలోని నేటి వార్తల ముఖ్యాంశాలు

image

✓ ఎంపీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలకరించిన తొలకరి వర్షాలు, చల్లబడిన వాతావరణం, వ్యవసాయ సాగులో రైతన్నలు
✓ పాలిసెట్ ఫలితాల్లో మెరిసిన పాలమూరు విద్యార్థులు.
✓ ఈనెల 6వ తేదీ నుంచి గృహ జ్యోతి అమలు.. అధికారుల వెల్లడి.
✓ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి అధికారుల సిద్ధం.

News June 4, 2024

MBNR: ‘పది’ సప్లిమెంటరీ పరీక్ష..65 మంది గైర్హాజరు

image

మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. అధికారులు మొత్తం 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 390 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 325 మంది హాజరవగా.. మరో 65 మంది గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ రవీందర్ జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

News June 4, 2024

కౌంటింగ్ కేంద్రం మూడంచెల భద్రత

image

MBNR పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేందుకు మొత్తం485 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనుందని తెలిపారు.

News June 4, 2024

పాలమూరులో టెన్షన్.. టెన్షన్ !

image

MBNR, NGKL పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుండటంతో అన్ని రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. రెండు.. పార్లమెంటు నియోజకవర్గాలలో విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరు ఓటమిపాలు కాబోతున్నారనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గెలుపు మీదా.. మాదా అన్నట్లుగా ప్రచారాలు నిర్వహించారు. పోలింగ్ జరిగిన 20రోజులపాటు రాజకీయం చర్చలు జరిగాయి. నేడు కౌంటింగ్ అనంతరం మన కొత్త ఎంపీలు ఎవరో తేలనుంది.

News June 4, 2024

MBNR, NGKL ఎంపీ RESULT.. మధ్యాహ్నానికి స్పష్టత !

image

MBNR, NGKLలోక్‌సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MBNR బరిలో ఉన్న 31 మంది, NGKL బరిలో నిలిచిన 19 మంది భవితయ్వం నేడు తేలనుంది. మహబూబ్‌నగర్‌లో మొత్తం 12,18,597 మంది ఓటు వేయగా, నాగర్‌కర్నూల్‌లో మొత్తం 12,07,471 మంది ఓటేశారు. నాగర్‌కర్నూల్‌లో అచ్చంపేటలో అత్యధికంగా 22 రౌండ్లు, తక్కువగా నాగర్‌కర్నూల్‌లో 17 రౌండ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో షాద్‌నగర్‌లో తక్కువగా 19 రౌండ్లు ఉన్నాయి.

News June 4, 2024

MBNR: కోడ్ ముగియగానే గృహజ్యోతి అమలు !

image

6 గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5న కోడ్ ముగిసిన వెంటనే 6వ తేదీ నుంచి గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు జారీ చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారి చేశారు. గృహలక్ష్మి పథకం అమలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంస్థపై రూ.10 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.

News June 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒సర్వం సిద్ధం.. రేపు ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు పూర్తి
✒కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత:SPలు
✒నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి
✒కౌంటింగ్ కేంద్రాలను సందర్శించడం అధికారులు, ఆయా పార్టీల అభ్యర్థులు
✒MBNR: ఆటో నుంచి పడి చిన్నారి మృతి
✒పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు
✒గృహ లక్ష్మీ పథకం.. ఎలక్షన్ కోడ్ ముగియగానే జీరో బిల్లుల జారీ

News June 3, 2024

MBNR: కౌంటింగ్ కేంద్రాల వివరాలు..

image

పాలమూరు యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్

➥72 కొడంగల్ -(PU)లైబ్రరీ బ్లాక్
➥73 నారాయణపేట-(PU)ఇండోర్ గేమ్స్ కాంపెక్స్
➥74 మహబూబ్‌నగర్- (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ G-ఫ్లోర్
➥75 జడ్చర్ల – (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తు (కుడి వైపు)
➥ 76 దేవరకద్ర- (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తు (ఎడమవైపు)
➥77 మక్తల్-(PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్- ఇండోర్ స్టేడియం
➥84 షాద్‌నగర్-(PU)ఫార్మాస్యూటికల్ బ్లాక్ 1వ అంతస్తు

News June 3, 2024

MBNR: మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా?

image

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా.? కామెంట్ చేయండి.
SHARE IT..