India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 26.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా 21.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 14.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా నవబ్‌పేటలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట జాతీయ స్థాయిలో క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 91 కళాశాలలు ఉన్నాయి. 40 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 210 పోక్సో కేసులు,84 అత్యాచారాలు, 844 మంది అదృశ్యమైన కేసులు నమోదయ్యాయి. బాధితులు ఎక్కువ సంఖ్యలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లాలో 356 అదృశ్యం కేసులు, 36 అత్యాచారాలు, 42 పోక్సో కేసులు నమోదు కావడం ఆందోళనను కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా MBNRలోనే మహిళా PS ఉంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక మహిళా PSలు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5.74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.

వయోజనులను అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్యక్రమం అమలు చేసిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని వయోజన విద్య ప్రోగ్రాం అధికారి నుమాన్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR-55.04%, GDWL-49.87%, NGKL-58.99%, NRPT-49.98%, WNPT-55.67 శాతం అక్షరాస్యత ఉందని అంచనా. GDWL జిల్లా రాష్ట్రంలోనే అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ ప్రతిష్టం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలు 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 65ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొడంగల్ ప్రాజెక్టులో ఆయాలు 65ఏళ్ల పైబడి ఉన్నారని గుర్తించారు. త్వరలో వీరుంతా పదవీ విరమణ చేయనున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, కాలువలు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
Sorry, no posts matched your criteria.