Mahbubnagar

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✒సివిల్స్ ఫలితాల్లో మెరిసిన పాలమూరు విద్యార్థులు
✒19న MBNRకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒ఏర్పాట్లు పూర్తి..18 నుంచి ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ
✒నారాయణపేట కాంగ్రెస్ ‘జన జాతర’ సభలో పసలేదు:BJP
✒ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయాల ముస్తాబు
✒’మన ఊరు-మనబడి’లో ఎంపికైన పాఠశాలలపై అధికారుల ఫోకస్
✒డబ్బు,మద్యం అక్రమ రవాణాపై నిఘా:GDWL ఎస్పీ
✒NRPT,మక్తల్:CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

News April 16, 2024

MBNR: వంశీ చంద్ రెడ్డి గెలుపుతో పాలమూరు అభివృద్ధి: ఎమ్మెల్యే

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పాలమూరు ఎంపీగా గెలిస్తే పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్‌లో జరిగిన మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎంపీ అభ్యర్థి వంశీ చందు రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని వాకిటి శ్రీహరి అన్నారు.

News April 16, 2024

MBNR: ఈనెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

ఈనెల 18 నుండి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తామని, మిగతా వాహనాలను 100 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయిస్తామని, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నియమాలను పాటించాలని తెలిపారు.

News April 16, 2024

‘మూడు రోజులు మాత్రమే సలేశ్వరం జాతరకు అనుమతులు’

image

నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో అతి పురాతనమైన 24 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వాటిలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో పేరొందినది సలేశ్వరం లింగమయ్య ఒకటని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి అన్నారు. ఈనెల 21, 22, 23 తేదీలలో మాత్రమే సలేశ్వరం జాతరకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. దీనిని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు, ప్రకృతి ప్రేమికులు అర్థం చేసుకోని సహకరించాలని కోరారు.

News April 16, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

√ పాలమూరు బిడ్డకు సివిల్స్ లో 3వ ర్యాంకు అభినందనలు తెలిపిన సీఎం.
√ వనపర్తి: ఈనెల 18 నుండి నామినేషన్ పత్రాల స్వీకరణ:కలెక్టర్.
√NGKL:రేపు బీఎస్పీలో చేరనున్న మంద జగన్నాథం.
√MBNR:ఈనెల 19న మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.
√ MBNR, నాగర్ కర్నూల్ పరిధిలో ఎంపీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం.
√ నారాయణపేట కాంగ్రెస్ సభలో పసలేదు: నాగు రావు నామాజీ.
√NRPT:రేపు శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఎస్పి.

News April 16, 2024

19న మహబూబ్ నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

MBNR జిల్లా కేంద్రానికి ఈ నెల 19న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్‌లో ఆయన మాట్లాడారు. 19న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

News April 16, 2024

MBNR: RS ప్రవీణ్ కుమార్‌కు BIG షాక్.. BSP నుంచి కీలక నేత పోటీ

image

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పాలమూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మంద జగన్నాథం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథం BSPలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన మాయావతిని కలిసేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. BRS నుంచి పోటీలో ఉన్న RS ప్రవీణ్ కుమార్‌కు ఇది పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News April 16, 2024

వనపర్తి: పోటీ చేసే అభ్యర్థులు.. 18న దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నోటిఫికేషన్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ఏప్రిల్ 18న నాగర్ కర్నూలు రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నందున నామినేషన్‌లు నాగర్ కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు.

News April 16, 2024

పాలమూరు బిడ్డకు సివిల్స్‌లో మూడో ర్యాంక్.. రేవంత్ రెడ్డి విషెష్

image

తెలుగు రాష్ట్రాల <<13064430>>సివిల్స్ విజేతలకు<<>> సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మందికి పైగా ఎంపికవటంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామనికి చెందిన దోనూరు సురేష్ రెడ్డి కూతురు దోనూరు అనన్య రెడ్డి‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాలమూరు బిడ్డ మూడో ర్యాంకు సాధించడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు.

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 42.3, గద్వాల జిల్లా అల్లంపూర్లో 41.3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.