India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటిందంటే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నటు పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 21.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న భూభారతి కార్యక్రమంతో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలో గురువారం భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మూలంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. దీనిపై మీ కామెంట్?
✔ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్:NGKL డీఈవో✔కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ ✔పరిశ్రమలపై నాగర్‌కర్నూల్ ఎంపీ చర్చ ✔BJPకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:చిన్నారెడ్డి✔బీసీ చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ✔పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి:TUCI✔NRPT: Way2News కథనానికి స్పందన.. ‘మొసలిని బంధించారు’✔‘పీయూ RTF కోర్స్ ఫీజులు విడుదల చేయాలి: విద్యార్థులు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.
మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి ఏప్రిల్ 22న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అధిక ధరలు తగ్గించి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ డీ.జానకి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా సీడ్ ప్రాసెసింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విత్తన శుద్ధి, ప్యాకింగ్ ,గోదాముల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి సమీక్ష జరిపామని తెలిపారు.
నేరం జరుగుతున్నప్పుడు చూసి తనకెందుకులే అని సాక్ష్యం చెప్పకపోయినా నేరస్థులే అవుతారని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. చిన్నచింతకుంట ఎంపీడీవో ఆవరణలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాల కార్మిక చట్ట నివారణ, బాలల సంరక్షణపై నిర్లక్ష్యాన్ని విడనాడాలని సూచించారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమన్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 190 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 164 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.6,639, కనిష్ఠ ధర రూ.5,241 లభించింది. మొక్కజొన్న 2,474 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,251, కనిష్ఠ ధర రూ.2259, కనిష్ఠ ధర రూ.1,681 లభించింది. వడ్లు ఆర్ఎన్ఆర్ 2004 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.2,306 లభించింది.
Sorry, no posts matched your criteria.