India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో రెగ్యులర్, ప్రయివేట్ విద్యార్థులు మొత్తం కలుపుకొని 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. పరీక్ష కేంద్రం పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి సెల్‌ఫోన్లు, గాడ్జెట్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందన్నారు.

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.