Mahbubnagar

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 42.3, గద్వాల జిల్లా అల్లంపూర్లో 41.3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 16, 2024

కనిష్ఠ స్థాయికి జూరాల నీటిమట్టం

image

జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గత ఏడాది వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం, ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రస్తుత యాసంగిలో సాగునీటి విడుదల నిలిపివేయడంతో జూరాలకు వచ్చి చేరే నీరు పూర్తిగా నిలిచిపోయింది. నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 314.160 మీటర్లకు పడిపోయింది. 0.362 టీఎంసీల నీరు మాత్రమే తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉంది.

News April 16, 2024

కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ

image

✔నియోజకవర్గాల వారీగా ఓటర్ నమోదు, చేర్పులు, మార్పులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
✔పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు, వీల్ చైర్స్.. రవాణా సదుపాయాలు కల్పించాలి
✔సీ విజిల్ ద్వారా ఫిర్యాదులలో వెంటనే పరిష్కరించాలి
✔హోమ్ ఓటింగ్, దానికి కావాల్సిన టీమ్లు, రూట్ల వారీగా ఏర్పాటు చేయాలి
✔పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
✔నూతన ఎపిక్ కార్డులు ఏర్పాటు చేయాలి

News April 16, 2024

మదనాపురం: సాగులో సందేహాలకు సంప్రదించండి

image

సాగులో అన్నదాతలకు ఎదురవుతున్న సమస్యలు, చీడ పీడల నివారణకు చర్యలు, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై సందేహాలకు నివృత్తి చేసేందుకు మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అన్నారు. వివరాలకు 94408 35658 సంప్రదించాలన్నారు.

News April 16, 2024

నవాబుపేటలో మహిళ దారుణ హత్య

image

నవాబుపేటలో మహిళ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. లక్ష్మమ్మ(45) కొడుకు పోలీస్ కాగా మరోచోట ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఆమె ఇంట్లోంచి సోమవారం దుర్వాసన రావడంతో పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తాళం పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో ఆమె పడి ఉంది. శరీరంపై నగలు, కడియాలు, గొలుసులు లేకపోవడంతో వీటి కోసమే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 16, 2024

బొంరాస్‌పేట: వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

image

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన బొంరాస్ పేట మండలం నాగిరెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నందిగామ నర్సింలు(45) గొర్రెలు మేపడానికి కొత్తూరు చెరువు సమీపంలోకి వెళ్లారు. సాయంత్రం గొర్రెలు ఇంటికి వచ్చినా నర్సింలు రాలేదు. దీంతో కుటుంబీకులు వెతకగా కొత్తూరు వెళ్లే రోడ్డు పక్కన పడి ఉన్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✒GDWL,MBNR: నేడు పలు మండలాలలో కరెంటు కట్
✒పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✒ఉమ్మడి జిల్లాలో శ్రీరామ నవమికి ఆలయాల ముస్తాబు
✒ధన్వాడ:నేటి నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
✒పలు మండలాలలో ‘రైతుల నేస్తం’ కార్యక్రమం
✒గండీడ్,ధన్వాడ:Way2News కు స్పందన..కొత్త బోర్లకు మోటర్లు బిగింపు
✒సిమ్మింగ్ పూల్ వద్ద నిబంధనలు తప్పనిసరి: పోలీసులు
✒కొనసాగుతున్న’DSC’ శిక్షణ

News April 16, 2024

NGKL: సలేశ్వరం జాతర.. అధికారుల హెచ్చరిక

image

లింగాల మండలం రాంపూర్‌లో జరిగే సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు నిబంధనలు పాటించాలని, భక్తులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు, మంట వస్తువులు, అధిక శబ్దాలు చేస్తూ జంతువులకు ఇబ్బంది కలిగించొద్దని అటవీ అధికారులు సూచించారు. జాతర జరిగే రోజుల్లో సా. 6 గంటల వరకు తిరిగి రావాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అన్నారు.

News April 16, 2024

ఉమ్మడి పాలమూరు వాసులకు గమనిక..!

image

ఎర్లీబర్డ్ స్కీమ్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్ పొందవచ్చని ఆయా మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT

News April 16, 2024

ఎంపీ ఎన్నికలు జరిగిన వెంటనే స్థానిక ఎన్నికలు: సీఎం

image

కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.